శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (10:41 IST)

జగన్‌పై నాకేం కోపం లేదు.. వైఎస్సార్‌పై మాత్రం ఓసారి పట్టరాని కోపం వచ్చింది?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఏమాత్రం కోపం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో జగన్ తనకు శత్రువు కాదంటూ వ్యాఖ్యానించిన జగన్.. మరోసారి జగన్‌పై తనకున్న అభిప్రా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనకు ఏమాత్రం కోపం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో జగన్ తనకు శత్రువు కాదంటూ వ్యాఖ్యానించిన జగన్.. మరోసారి జగన్‌పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లగక్కారు. 
 
జగన్ లక్ష కోట్ల రూపాయలు తిన్నారో.. లేదో ఆ భగవంతుడికే తెలియాలన్న పవన్.. ఆయన తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిపై మాత్రం ఓసారి పట్టరాని కోపం వచ్చిందన్నారు. 2007లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఓ సినిమా తీయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్న తనలాంటి వాడినే బెదిరిస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందోనని తలచుకుంటే కోపం వచ్చినట్లు తెలిపారు. 
 
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై సోమవారం నిర్వహించిన కవాతు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ.. సొంత అన్నయ్యను వదిలి వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. టీడీపీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ కార్యాలయాల మీద చేస్తున్నట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం నిజంగా దాడి జరిగితే అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు.
 
ఇంకా పవన్ మాట్లాడుతూ.. తన తెలుగుజాతి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లు.. మదమెక్కిన మహిషాసురుడు ల్లాంటి మానవులను తెగనరికే గొడ్డళ్లు అన్నారు. తన తెలుగు జాతి ఆడపడుచులు, అక్కాచెల్లెళ్లకు మనస్ఫూర్తిగా రెండు చేతులతో నమస్కారం అన్నారు. తల్లి గోదావరిలో తెల్లటి ముత్యాలు తన తెలుగింటి ఆడపడుచులు అన్నారు.
 
పనిలో పనిగా మంత్రి నారా లోకేష్‌పై పవన్ మండిపడ్డారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అని విమర్శలు చేస్తారని, కానీ కనీసం పంచాయతీల్లో పోటీ చేయని లోకేష్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. తాను యాక్టర్ సరే మరి లోకేష్‌కు ఏం తెలుసో చెప్పాలన్నారు. పంచాయతీ వ్యవస్థ గురించి తెలియని వ్యక్తి మంత్రినా అంటూ అడిగారు. 
 
వారసత్వం అంటే తండ్రి రూపురేఖలు, ఆస్తులు అన్నారు. కానీ తండ్రి అనుభవం మాత్రం రాదు కదా అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంతో ఇదీ అంతే నని పవన్ ఎద్దేవా చేశారు.