శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (11:12 IST)

ముగిసిన ఉపవాస దీక్షలు : అట్టహాసంగా రంజాన్!

పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు సోమవారంతో ముగిశాయి. శనివారం రంజాన్ పండుగ అట్టహాసంగా జరిగింది. ఈసారి తెరాస ప్రభుత్వం బోనాలు పండుగతో పాటు రంజాన్ వేడుకకు ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ఈద్గాలకు 50లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. 
 
నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, దైవ చింతనలో గడిపిన ముస్లింలు మంగళవారం నాటి ఈద్-ఉల్-ఫతర్ నమాజుతో రంజాన్ మాసానికి వీడ్కోలు పలుకుతారు. జిల్లా కేంద్రంలోని నాలుగు ఈద్గాలలో ప్రత్యేకంగా జరిగే ప్రార్థనలకు నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో ముస్లింలు తరలిరానున్నారు. 
 
గల్ఫ్ దేశాల్లో రంజాన్ పర్వదినం వేడుక జరిగిన మరుసటి రోజు ఇక్కడ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు అనుగుణంగానే సోమవారం గల్ఫ్ దేశాల్లో ఈ వేడుకను జరుపుకోగా, మంగళవారం ఇక్కడ పండగ నిర్వహించారు.  ఈ వేడుకకు సంబంధించి ప్రత్యేక నమాజు వేళలను నిజామాబాద్ మత పెద్దలు ప్రకటించారు. ఈ విధంగా ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్‌ను అట్టహాసంగా చేశారు.