శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (17:24 IST)

మానవ హక్కుల చట్టాలను తెలుగు ప్రజలు తెలుసుకోవాలి..

కాకినాడ: జాతీయ మానవ హక్కులు, మహిళా, శిశుసంక్షేమ కమిషన్ జాతీయ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర సమావేశం ఆదివారం కాకినాడలో జరిగింది. స్థానిక బాలాత్రిపుర సుందరి అమ్మవారి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంకు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు ఎంఎస్ అఖిల్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. 
 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమర్రాజు భరద్వాజ్ శర్మ మాట్లాడుతూ.. ఈ సంస్థ నేషనల్ టేరిటరీ యాక్ట్ కింద 1986లో రిజిస్టర్ అయి ఉంది అన్నారు. ఈ రాష్ట్ర సదస్సులో మహిళ, పోలీస్, కార్మిక, విద్యా, మానవ హక్కులు, ఐపిసి, సిఆర్‌పిసి చట్టాలు, సమాచార, ప్రయివేట్ స్కూల్స్ తదితర చట్టాలు గురించి వివరించారు ఈ సంస్థ ముంబై, ఢిల్లీ ప్రధాన కేంద్రాలుగా పని చేస్తోంది అన్నారు. 
 
అధ్యక్షులు అఖిల్ మాట్లాడుతూ తెలంగాణలో ఈ సంస్థ చురుగ్గా పని చేస్తోంది అన్నారు. ఏపీలో కార్యక్రమాలు వేగవంతం చేస్తాము అన్నారు. బెటర్ సొసైటీ కోసం పని చేయడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు. రాష్ట్ర కార్యదర్శి డీహెచ్‌వి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని చట్టాలుపై కూలంకషంగా చర్చించారు.  
 
సంస్థ ఆశయాలను, లక్ష్యాలను ప్రజాల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రతినిధుల సందేహాలను అఖిల్, భరద్వాజ్ శర్మ లు నివృత్తి చేశారు.దాదాపు 110 వరకు చట్టాలు గురించి చర్చించారు. సంస్థకు మంచి పేరు తేవాలని దుర్వినియోగం చేయరాదని వారు ఇరువురు సూచించారు. ఏపీలో 13 జిల్లాల్లో కమిటీలు వేయాలని నిర్ణయించారు. 
 
ఈ సమావేశంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్ కె ఫరీడ్ మోహిద్దీన్‌తో పాటు, మహ్మద్ అస్లాo, సయ్యద్ సిరాజ్‌లు తెలంగాణా నుంచి విచ్చేసారు. ఏపీ నుంచి వివి మహేశ్వర మనోహరరావు, జి శేషగిరిరావు, ఎన్ వి శివ శైలజ, వి పద్మాలత, ఎన్ వి ఎస్ హెచ్ ప్రకాష్ రావు, పి గిరీష్, కెవిఆర్‌కె వేణుగోపాలరావు, జె ఈశ్వర రావులు హాజరు అయ్యారు.