శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (07:06 IST)

భరణం కట్టాల్సి వస్తుందని.. భార్యను లేపేసిన భర్త

ఏడడుగులు మూడు ముళ్ళతో ఏకమయ్యాడు. జీవితాంతం తోడుంటానని మాటిచ్చాడు. సంతానం లేదన్న కారణంగా కాదు పొన్నాడు. కోర్టుకెక్కిన పాపానికి భరణం చెల్లించాల్సి వస్తుందనుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కర్కశం చంపి పూడ్చి, కాల్చి ఆమె శవంతోనూ ఆడుకున్నాడు. సంఘటన వివరాలివి..
 
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె మండలం కమ్మనపల్లె పంచాయతీ ఎర్రకదిరే పల్లెకు చెందిన శిల్పకు అదే గ్రామానికి చెందిన కుమార్‌రాజాతో పెళ్ళయ్యింది. కొన్నాళ్ళు సంసారం సవ్యంగానే సాగింది. శిల్పకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేరనే సాకు తో శిల్పను అత్తమామలు వేధించేవారు. దీనిపై బాధితురాలు భర్తతో పాటు అత్తమామలపై పలమనేరు కోర్టులో కేసు వేసిం ది. తీర్పు వెలువడ్డాక ప్రతినెలా బాధితురాలికి భరణం చెల్లిం చాల్సి వస్తుందని కుమార్‌రాజా భావించాడు. ఎలాగైనా భార్యను మట్టుబెట్టాలని పథకం వేశాడు. 
 
మూడు నెలల క్రితం కోర్టు వాయిదాకొచ్చిన శిల్పతో కుమార్‌రాజా ప్రేమగా మాట్లాడి కేసు రాజీ చేసుకుందామని, ఇక తన తల్లిదండ్రులతో ఎటువంటి ఇబ్బందులూ ఉండవని, బెంగళూరులో కాపురం పెడదామని మాయమాటలతో నమ్మబలికాడు. రెండ్రోజుల్లో తాను చెప్పిన ప్రదేశానికి రావాలన్నాడు. భర్త మాటలు గుడ్డిగా న మ్మిన శిల్ప ఎర్రకదిరేపల్లె సమీపంలోని ఓ చింత తోపు వద్దకు వెళ్లింది. అంతే తనతోపాటు వచ్చిన తన అక్క స్నేహితుడు టైలర్ మౌల శిల్పపై విరుచుకుపడ్డాడు. ఇద్దరు కలసి మెడకు తాడు బిగించి చంపేశారు. 
 
తొలత మృతదేహాన్ని గ్రామ సమీపంలోని ఓ చెరువులో పూడ్చిపెట్టేశారు. బయటపడుతుందేమోనన్న భయంతో మళ్లీ దాన్ని తీసుకొచ్చి తమ పొలంలోని చెరకు తోటలో పెట్రోల్ పోసి పూర్తిగా తగులబెట్టేశారు. మృతదేహం కాలిపోయిన తర్వాత మిగిలిన ఎముకలను తీసుకొని కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ చెరువులో పూడ్చిపెట్టారు.
 
శిల్ప కనిపించకుండా పోవడంతో పోలీసు కేసు నమోదయ్యింది. అనుమానం వచ్చిన పోలీసులు భర్త సెల్ ఫోన్ సంభాషణలను పరిశీలించారు.హత్య జరిగిన రోజు భర్త, టైలర్ మౌల, మరికొందరు ఒకే టవర్ లొకేషన్‌లో ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకుని నాలుగు పీకితే హత్యోదంతం కక్కేశారు. ప్రస్తుతం గంగవరం పోలీసులు నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.