Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చెంపలపై కొట్టి.. చున్నీతో మెడబిగించి హత్య చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా కేకలు..

గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:32 IST)

Widgets Magazine
murder 1

కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న కసాయి భర్త... ఆమెను కొట్టి చంపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన ఫిరంగి సాయికృష్ణతో రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన నాదెండ్ల నాగేశ్వరరావు కుమార్తె రజని (20)కి గతేడాది వివాహమైంది. గత ఆరునెలలుగా భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య తరచూ చిన్నపాటి గొడవలు జరుగుతూ వచ్చాయి. భర్తతో కలిసి జీవించలేక రజనీ పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అయితే, తల్లిదండ్రులతో పాటు పంచాయతీ పెద్దలు నచ్చజెప్పి తిరిగి కాపురానికి పంపించారు. బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భర్త సాయికృష్ణ, భార్య రజనిని ముందుగా చెంపలపై కొట్టి తర్వాత చున్నీతో మెడబిగించి చంపివేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్టుగా ఎరగనట్లు కేకలు వేశాడు. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు.. ఇంటికి వచ్చి చూడగా, రజనీ కిందపడిపోయివున్నది. 
 
దీంతో సమాచారాన్ని రజినీ తల్లిదండ్రులకు చేరవేశారు. తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన పిన్నెల్లి గ్రామానికి చేరుకున్నారు. బంధువులు, తల్లిదండ్రులు సాయికృష్ణను నిలదీసి అడుగగా అనుమానంతో తానే చంపానంటూ అంగీకరించాడు. రజనీ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్నాచెల్లెళ్ళట.. ప్రేమించుకున్నారట.. నగ్నంగా నడి వీధుల్లో నడిపించిన గ్రామ పెద్దలు

ఓ గ్రామ పంచాయతీ పెద్దలు మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిపోయేలా తీర్పునిచ్చింది. ...

news

కట్నం కోసం నిండు గర్భిణిని కాల్చేశారు.. మృగంలా మారిన భర్త...

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. కట్నం కోసం నిండు గర్భిణిని ...

news

అమెరికాలో ఉ.కొరియా బాంబు.. అగ్రనగరాలు ధ్వంసం.. కాలిబూడిదైన వైట్‌హౌస్ జెండా... వీడియో

అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధానికి ఉత్తర కొరియా సై అంటోంది. తాజాగా మరో కవ్వింపు చర్యకు ...

news

ఫేస్‌బుక్‌ మోసం.. ఏడాది పరిచయం రూ.6లక్షల దాకా టోకరా..

ఫేస్‌బుక్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి ...

Widgets Magazine