శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (16:55 IST)

ప్రియుడితో పడకపై... భార్యను హతమార్చిన భర్త

వేరే వ్యక్తితో పడకపై కలిసి ఉండటం చూసిన భర్త ఆగ్రహం పట్టలేక భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న బొండా అప్పారావు... తన భార్యతో పడకపై అదే గ్రామానికి చెందిన సూరిబాబును చూసి భరించలేక ఆగ్రహంతో ఆమెను దారుణంగా నరికేశాడు.
 
సూరిబాబుపై కూడా దాడి చేయగా అతడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అప్పారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఓ వైపు తల్లి మృతి, మరోవైపు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో వారి ఇద్దరి పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.