Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాకిచ్చిన శాడిస్ట్ భర్త

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:53 IST)

Widgets Magazine
current shock

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి ఆడపిల్ల పుట్టిందని కరెంట్ షాక్ ఇచ్చాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పెనమలూరు పెద్ద గుడి ప్రాంతానికి చెందిన ప్రశాంతి, శ్రీలం రాజారత్నం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజాకు గతంలోనే వివాహమైంది. తొలి భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు.
 
విదేశాల్లో వుండి పనిచేసిన రాజా.. ప్రస్తుతం ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఇంటి వద్దే వుండి పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాంతితో ప్రేమించి వివాహం చేసుకున్న రాజా దంపతులకు తొలుత బాబు పుట్టాడు. వరకట్నం కోసం భార్యను వేధించిన రాజాపై పోలీసులకు గతంలో ఫిర్యాదు కూడా అందింది. అయితే పెద్ద మనుషుల రాజీతో కేసును ప్రశాంతి ఉపసంహరించుకుంది. 
 
ఈ దంపతులకు ఇటీవల పాప పుట్టింది. ఆడ పిల్ల పుట్టడంతో భార్యపై కక్ష పెంచుకున్న రాజా.. ఈ నెల 2న గదిలో నిద్రిస్తున్న భార్య ప్రశాంతికి కరెంట్ వైర్లతో షాక్ ఇచ్చాడు. దీంతో కేకలు వేయడంతో రాజా పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న రాజా కోసం వెతుకుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్

గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ...

news

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ...

news

జగన్‌కు షాక్.. టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ ...

news

ఇక తాడో.. పేడో తేల్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో ఇకపై తాడో.. పేడో తేల్చుకోవాల్సిందిగా పార్టీకి చెందిన ...

Widgets Magazine