Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీషపై అత్యాచారం జరగలేదా? ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్ వచ్చేసిందా? రాజీవ్-శిరీష భార్యాభర్తలని?

గురువారం, 29 జూన్ 2017 (10:44 IST)

Widgets Magazine

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుపై రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తోంది. దీంతో హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పుటేజ్ మాత్రం లభ్యం కాలేదు. అంతే కాకుండా శిరీష కుటుంబ సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా లభ్యం కాలేదు. 
 
ఈ నేపథ్యంలో శిరీషది హత్యా లేకుంటే ఆత్మహత్యా అని తేల్చుకునేందుకు ఫోరెన్సిక్ రిపోర్టు రావాలని పోలీసులు చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక రిపోర్ట్ మాత్రం ఆమెపై  లైంగిక దాడి జరగలేదని చెప్తోంది. ఈ ప్రాథమిక రిపోర్టులో స్పెర్మొటోజ కనిపించలేదని నిపుణులు చెప్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతోంది. శిరీషపై ఆత్యాచారం జరగని పక్షంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టుకి, ఫైనల్ రిపోర్టుకి వ్యత్యాసం ఉంటుందా? అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
మరోవైపు బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో రెండు రోజుల కస్టడీ అనంతరం పోలీసులు నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, విచారణలో వారు ఆసక్తికర విషయాలు వెల్లడించారని సమాచారం. శిరీష, రాజీవ్‌ల మధ్య గొడవల్ని సొమ్ము చేసుకోవాలనే కుట్రతోనే ఆమెను కుకునూరుపల్లికి తీసుకెళ్లినట్లు శ్రవణ్‌ విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది.
 
అలాగే శిరీషతో తాను గొడవపడిన మాట వాస్తవమేనని రాజీవ్‌ స్నేహితురాలు తేజస్విని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తాను, రాజీవ్‌ పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఒకరోజు స్టూడియోకి వెళ్లానని, రాజీవ్‌, శిరీషలు భార్యభర్తలంటూ అక్కడి పనివారు చెప్పడంతో తనకు కోపం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకే పోలీస్ స్టేషన్ వెళ్లామని, నిజంగా ఆమెపై ద్వేషం ఉంటే ఫిర్యాదు వెనక్కు తీసుకునేదాన్ని కాదని చెప్పారు. మరోవైపు నందు, నవీన్‌లు ఎవరంటూ తేజస్విని, రాజీవ్‌, శ్రవణ్‌లను ప్రశ్నించగా.. తమకు తెలీదని, శిరీషకు స్నేహితులు లేదా బంధువులై ఉండొచ్చని వారు వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజాను చూస్తే తుర్రుమని పారిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ఎందుకబ్బా?

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాను చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు ఆమడదూరం పారిపోతున్నారు. ...

news

తెరాస మంత్రి బూతు పురాణం... నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌!

తెలంగాణ రాష్ట్ర మంత్రి చందూలాల్ బూతు పురాణం వినిపించాడు. ములుగు జిల్లా సాధన కమిటీ ...

news

రంజాన్‌కు ఇంటికొచ్చి.. స్నేహితుడిని రక్షించి... ప్రాణాలు కోల్పోయిన బీటెక్ యువకుడు

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ ...

news

ఫోన్ తీయలేదనీ భార్య తలను గోడకేసికొట్టిన కసాయి భర్త

గుంటూరు జిల్లా సంగడిగుంటలో ఓ దారుణం జరిగింది. ఫోను తీయలేదన్న కోపంతో భార్య తలను ఓ ...

Widgets Magazine