Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాద్ పరువు తీసిన బిర్యానీ.. గుర్తింపు కోల్పోయిన బిర్యానీ మేకర్స్

హైదరాబాద్, శుక్రవారం, 10 మార్చి 2017 (04:00 IST)

Widgets Magazine

తెలంగాణ ప్రస్తుత రాజధాని హైదరాబాద్ పరువు పోయింది. కారణం నోరూరించే దాని బిర్యానీ వల్లే. నిజాం రాజుల కాలం నుంచి హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గౌరవం కల్పించిన చిహ్నాలు రెండే రెండు. అవి చార్మినార్.. రెండు బిర్యానీ. చార్మినార్ హైదరాబాద్‌లో ఉంది అంటే ప్రపంచమంతా నమ్ముతుంది. అలాగే అసలు సిసలైన బిర్యానీ ఎక్కడుంది అంటే కూడా హైదరాబాద్‌కేసే చూపుతారు. కాని ఆ బిర్యానీ మీదే అని గ్యారంటీ కానీ ఆధారం కాని ఉన్నాయా అన్న ప్రశ్నకు బిర్యానీ తయారుదారుల సంస్థ చేతులెత్తేసింది. అలా నగరం పరువు కూడా పోయింది. 
 
ఈ సమస్య ఎక్కడ బయలుదేరిందంటే .. హైదరాబాద్ బిర్యానీకీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌లోని దక్కన్ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ దరఖాస్తు చేసింది. కానీ  అసలు హైదరాబాద్‌ బిర్యానీ.. ఇక్కడిదే అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు ఏవీ లేవని పేర్కొం టూ.. చెన్నైలోని జియోగ్రాఫికల్‌ ఇండికేషన్స్‌ రిజస్ట్రీ గుర్తింపు ఇవ్వడానికి తిరస్కరించింది.
 
నిజాం రాజుల వంటశాల నుంచి బిర్యానీ సామాన్యుని చెంతకు చేరిందని హైదరాబాద్‌లో కథలు కథలుగా చెబుతుంటారు. అయినా సరే దీనికి ఆధారాలు చూపలేకపోయారు. బిర్యానీ మీదే కావచ్చు కానీ దాని చరిత్రకు సంబంధించిన ఆధారాలు చూపమంటే ఎలా చూపుతారు. తన వంటగదిలో ఆ బిర్యానీని ఎవరు చేశారో చెప్పడానికి నిజాం  రాజే లేకపోయె మరి. కాబట్టి  ఈ బిర్యానీ తమది అని చెప్పుకునే ఘనత హైదరాబాద్‌కు లేకుండా పోయంది. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాహుల్ శని ఇక్కడా కొట్టిందా.. బేర్ మంటున్న ఎస్పీ నేతలు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడంతో ఉత్తరప్రదేశ్‌ అధికార పార్టీ సమాజ్ వాదీ ...

news

ఆ ప్రాభవం ఇక ముగిసిన కథే.. రాహుల్‌పై పెదవి విరుస్తున్న కాంగీయులు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కథ ముగిసినట్లేనా.. 2012 నుంచి అయిదేళ్ల పాటు ...

news

కన్నతండ్రినే ధిక్కరించినట్లు నటించినా ఫలితం దక్కని అఖిలేష్

ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికార కూటములకు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్‌ ...

news

నిజంగానే నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిస్తే కేంద్ర మంత్రులందరినీ మోదీ గోడకుర్చీ వేయించడం ఖాయం

అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, వాటిలో నాలుగు బీజేపీ పరం కానున్నాయని ఎగ్జిట్ ...

Widgets Magazine