Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీష కుమార్తె దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు నేనే భరిస్తా: ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్

సోమవారం, 10 జులై 2017 (16:11 IST)

Widgets Magazine

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష కేసు ముగిసిన నేపథ్యంలో ఆమె కుమార్తె దీప్తిని చదివించేందుకు ఏపీ సీఐడీ ఐజీ సునీల్ కుమార్ ముందుకు వచ్చారు. దీప్తి డిగ్రీ వరకు చదివే ఖర్చులు తానే భరిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా దీప్తి చదువుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ఆదిత్యా విద్యాలయానికి వెళ్లి చెక్కును అందించారు. 
 
శిరీష ఆత్మహత్య చేసుకుందని.. ఆమెపై అత్యాచారం జరగలేదని.. పోలీసులు తేల్చేశారు. ఈ నేపథ్యంలో తల్లిని కోల్పోయిన దీప్తి ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోని ఆదిత్యా స్కూలులో ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్యల వద్ద వద్ద ఉంటున్న దీప్తిని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఆమె డిగ్రీ ముగించేంత వరకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు బ్యూటీషియన్‌ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలోనూ స్పష్టమైందని తెలిపారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్‌, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది.
 
ఇంకా శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్‌ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మా ఇళ్ల మధ్య నుంచి మద్యం దుకాణాలు ఎత్తేస్తే ఊరుకోం... మహిళల ధర్నా... ఎక్కడ?

మద్యం దుకాణాలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని మహిళలు ఆందోళనలకు దిగడం సర్వసాధారణం. ...

news

పాకిస్థాన్‌లో ఘోరం-ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని అన్న ఏం చేశాడంటే?

పాకిస్థాన్‌లో పరువు హత్యలు జరగడం మామూలైపోయింది. తాజాగా ప్రేమికుడితో పారిపోయిన సోదరిని ఓ ...

news

మంత్రాలు చేస్తున్నాడనే నిందలు... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ...

news

హైదరాబాద్‌లో మందుబాబుల కోసం 'ఓకే బాయ్స్ యాప్'

హైదరాబాద్ నగరంలో మందుబాబుల సేవల కోసం ఓ కుర్రోడు ఓకే బాయ్స్ పేరిట ఓ యాప్‌ను తయారు చేశారు. ...

Widgets Magazine