Widgets Magazine

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (12:09 IST)

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో అధికమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో మందు కొట్టి.. ఖరీదైన బెంజ్‌ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ యువతి, తనను అడ్డుకున్న పోలీసులపై చిందుకు తొక్కింది. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా వారి సహనానికి పరీక్షగా నిలిచింది. 
 
గత రాత్రి 105 మంది మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబట్టారు. వీరిలో ఓ యువతి తప్పతాగి హంగామా చేసింది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు రంగ ప్రవేశం చేసి ఆమెకు పరీక్ష చేయాల్సి వచ్చింది. సదరు యువతి మీడియా కెమెరాలను నాశనం చేసేందుకు చూసింది. తనను వీడియో తీస్తున్న కెమెరామెన్ వెంటపడింది. 
 
సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి రాహుల్, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా పోలీసుల మందు నానాయాగీ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల తర్వాత 42 కార్లు, 61 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలనూ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. తామెంత విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా.. మందుబాబు మెట్టుదిగడం లేదని పోలీసు అధికారులు చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను ...

news

వాణీ విశ్వనాథ్‌కి బిస్కెట్ - రోజాకు జిలేబీ... ఏంటిది..?

ముందస్తు ఎన్నికలు రాకుండానే వైసిపి ఎమ్మెల్యే రోజాకు కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటి.. ...

news

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ...

news

అబ్బే... పవన్ కళ్యాణ్ దానికి సరిపోడు... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు(Video)

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ...

Widgets Magazine