శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2016 (11:36 IST)

పూటుగా మద్యం సేవించింది.. మత్తు దిగేందుకు మహిళ బుగ్గ కొరికేసింది..

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పూటుగా మద్యం సేవించింది. మత్తు పూర్తిగా ఎక్కడంతో ఏం చేయాలో తోచక.. తినుబండరాలు విక్రయించే మహిళను జుట్టుపట్టుకునిలాగి.. బుగ్గ, చెవులు కొరికేసింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పూటుగా మద్యం సేవించింది. మత్తు పూర్తిగా ఎక్కడంతో ఏం చేయాలో తోచక.. తినుబండరాలు విక్రయించే మహిళను జుట్టుపట్టుకునిలాగి.. బుగ్గ, చెవులు కొరికేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారి అవాక్కయ్యారు. సోమవారం రాత్రి హైదరాబాద్, నెక్లెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
సోమవారం రాత్రి నెక్లెస్‌రోడ్‌ ఇందిరాగాంధీ చౌరస్తాలో మద్యం మత్తులో ఉన్న యువతి రహదారికి అడ్డుగా నిలబడింది. ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వాటిపై రాళ్లు రువ్వింది. దీంతో కొన్ని కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతటితో ఆగని ఆ యువతి... అక్కడే తినుబండారాలు విక్రయించే విజయ అనే మహిళను జుట్టుపట్టి లాగింది. గొంతునులిమి.. కొరకటంతో గాయపడింది. 
 
అడ్డుకోబోయిన వారిని దుర్భాషలాడింది. ఈ సీన్ మొత్తాన్ని చూసిన యువకులు ఆశ్చర్యపోయారు. యువకులు అందించిన సమాచారంతో అక్కడకు చేరిన పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు విజయ ఫిర్యాదుతో యువతిని సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మత్తువీడే వరకూ అక్కడే ఉంచారు. అనంతరం ఆమె వివరాలు తెలుసుకొని ఇంటికి పంపారు. మంగళవారం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రావాలని యువతిని పోలీసులు ఆదేశించారు.