Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిశ్చితార్థం అయ్యింది... కానీ తేడాలు వచ్చాయి... అదే టెక్కీ హత్యకు కారణమా?

మంగళవారం, 30 జనవరి 2018 (14:15 IST)

Widgets Magazine
murder 1

హైదరాబాదులో వరుస హత్యలు కలకలం రేపాయి. మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైనారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు దారుణంగా హత్యకు గురికావడంతో పోలీసులు తలపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ వద్ద గోనె సంచిలో ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
అలాగే హయత్ నగర్‌లో ఓ విద్యార్థిని అనూష హత్యకు గురైంది. ఈమెను అమానుషంగా హత్య చేశారు. బండతో మోదడంతో ఈమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం చందానగర్‌లో మూడు హత్యలు కలకలం రేపిన నేపథ్యంలో మరో ఇద్దరు యువతులు దారుణంగా హత్యకు గురికావడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహిళలకు భాగ్యనగరంలో భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
హయత్‌ నగర్‌లో హత్యకు గురైన యువతి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష, హైదరాబాదులో వుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుందని.. ఇటీవలే మోహన్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి కూడా కుదిరిందని చెప్పారు. అయితే ఇంతలో హత్యకు గురవడం వెనుక మోహన్ హస్తం ఏమైనా వుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
మోహనే తన బిడ్డను హత్య చేసి వుంటాడని.. నిశ్చితార్థం తర్వాత నుంచి అనూషను మోహన్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని.. ఘటన జరిగిన రోజు నుంచి అతని మొబైల్‌ స్విచాఫ్‌ చేసి ఉందని అనూష సోదరులు మీడియా ముందు ఆరోపించారు. పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. 
 
మరోవైపు కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీ బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో ఓ గోనెసంచిలో యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ గోనె సంచిలో ముక్కలుగా నరికిన యువతి మృతదేహం కనిపించిందని.. హత్యకు గురైన యువతి ఎవరనేదానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
అంతకుముందు శనివారం రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో మూడు హత్యల ఉదంతం కలకలం రేపింది. అపర్ణ అనే మహిళతో సహజీవనం చేస్తున్న మధు.. అపర్ణతో పాటు ఆమె కూతురు కార్తికేయ(5), తల్లి జయమ్మ(50)లను హతమార్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేవలం మూడు రోజుల్లో పాస్‌పోర్టు...

ఇకపై కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టును జారీచేయనున్నారు. ఈ మేరకు తాత్కాల్ పాస్‌పోర్ట్ ...

news

ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య... రోడ్డుపై ల్యాండైన విమానం (వీడియో)

విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఓ విమానం నడిరోడ్డుపై ల్యాండైంది. ఈ ఘటన కాలిఫోర్నియాలో ...

news

అరెస్టు చేయించి సెల్‌లో వేయిస్తాం.. నిత్యానందకు కోర్టు వార్నింగ్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు మద్రాసు హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ...

news

మహాత్ముడికి రాష్ట్రపతి - ప్రధాని, ఇతర నేతలు నివాళులు

మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు ...

Widgets Magazine