Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బొటానికల్ గార్డెన్ మర్డర్ మిస్టరీ వీడింది ... మరిదే హంతకుడు

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (10:29 IST)

Widgets Magazine
murder

హైదరాబాద్, బొటానికల్‌ గార్డెన్‌ దగ్గర మహిళ కేసులో మిస్టరీ వీడింది. గర్భిణిని ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులకు హంతకుల ఆనవాళ్లు దొరికాయి. శవాన్ని బైక్‌పై తీసుకొచ్చి పడేసినట్టు సీసీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. గత నెల 30న వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు 10కి పైగా వీడియోలను విశ్లేషించి హంతకుల్లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నట్టు గుర్తించారు.
 
ఈ కేసులో ద్విచక్ర వాహనం నంబరు ప్లేట్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ గర్భిణి హత్యకు కుటుంబ గొడవలే కారణమని పోలీసులు తేల్చారు. సొంత వదినను మరిది అమర్‌కాంత్‌ ఝా, ఆయన తల్లి కలిసి చంపినట్లు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్య అనంతరం అమర్‌కాంత్‌ ఝా బీహార్‌ పారిపోయాడు. మహిళ హత్య కేసులో గచ్చిబౌలి పోలీసులు అత్తను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అమర్‌కాంత్‌ ఝా, మృతురాలి భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్దిఖీ నగర్‌లో నివాసం ఉంటున్న అమర్‌కాంత్‌ ఝా, ఆయన తల్లి కలిసి కోడలిని హత్య చేసి జనవరి 29న బొటానికల్‌ గార్డెన్‌ వద్ద మృతదేహాన్ని పడేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
హైదరాబాద్ హత్య మరిది పోలీసులు Woman Body Chopped Dumped Hyderabad Horror

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుటుంబాన్ని కాపాడి అమరుడైన సుబేదార్ మదన్‌లాల్

ఉగ్రవాదులు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వారికి ఎదురొడ్డి, తన కుటుంబ సభ్యులను ...

news

జేపీతో మాట్లాడాక చెపుతా... : ఉండవల్ల అరుణ్ కుమార్

లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సమావేశం ...

news

అమ్మాయిలు కూడా బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోంది : మనోహర్ పారికర్

ఈ కాలపు అమ్మాయిలు బీర్ తాగడం చూస్తుంటే భయమేస్తోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ...

news

సన్నీలియోన్ అర్ధనగ్న ఫోటోలను రైతులు అలా ఉపయోగిస్తున్నారట?

నరదిష్టి నుంచి పంట పొలాలను కాపాడేందుకు రైతులు వినూత్నంగా ఆలోచించారు. బాలీవుడ్ శృంగారతార ...

Widgets Magazine