పెళ్లి పేరుతో వాడుకున్నాడు.. మోసపోయా.. చనిపోతున్నా...

మంగళవారం, 5 డిశెంబరు 2017 (20:59 IST)

techie suicide

హైదరాబాద్ నగరంలో ఓ దంతవైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ కామాంధుడికి తన కన్నెత్వాన్ని అప్పగించి మోసపోయింది. ఈ మోసాన్ని తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆ వైద్యురాలి పేరు గీతాకృష్ణ. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో నివశిస్తోంది. సొంతవూరు జగిత్యాల పట్టణం. చైతన్యపురిలోని ఓ వసతి గృహంలో ఉంటున్న అమె మంగళవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
నరేశ్‌ అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అందుకే మానసికంగా కుంగిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టింది. బలవన్మరణానికి ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఆపై ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. 
 
హాస్టల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని కిందికి దించారు. గీతాకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :  
Suicide Hyderabad Love Woman Dentist

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లికి ముందే పొటెన్సీ పరీక్షలు చేయాలి : డాక్టర్ సమరం

పురుషుల శృంగార సామర్థ్యం (సెక్స్)పై ఏమాత్రం సందేహం ఉన్నా పెళ్లికి ముందే పొటెన్సీ పరీక్షలు ...

news

టీచర్ రాజేష్ శాడిస్టుగా ఎందుకు మారాడంటే...

తాను నపుంసకుడన్న సీక్రెట్‌ను బహిర్గతం చేసినందుకుగాను శోభనం రోజు రాత్రే కట్టుకున్న భార్యపై ...

news

చలోరే చలోరే చల్ - జనంలోకి జనం కోసం జనసేనాని.. పాట (వీడియో)

భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ అంబేద్కర్ 61వ వర్థంత సందర్భం గా ...

news

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, ...