శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2018 (12:06 IST)

కట్టుకున్న భర్తే అంత పనిచేశాడు.. ఫేక్ అకౌంట్.. ఫోన్ నెంబర్ ఇచ్చేశాడు..

కట్టుకున్న భార్యను ఓ భర్త వేధించాడు. వేరొక ఊరిలో ఉద్యోగం చేస్తున్న భార్య నకిలీ ఫే‌స్‌బుక్ ఖాతాలను సృష్టించి.. ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి వేధిస్తున్న పైశాచిక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళి

కట్టుకున్న భార్యను ఓ భర్త వేధించాడు. వేరొక ఊరిలో ఉద్యోగం చేస్తున్న భార్య నకిలీ ఫే‌స్‌బుక్ ఖాతాలను సృష్టించి.. ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చి వేధిస్తున్న పైశాచిక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ శాంతి సృజన్‌‌కు ఇటీవలే హైదరాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పని చేస్తున్న యువతితో వివాహం జరిగింది. ఆమెకు శ్రీకాకుళానికి బదిలీ కాకపోవడంతో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పేరిట ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించారు. 
 
బాధితురాలికి అసభ్య సందేశాలు, అపరిచితుల నుంచి కాల్స్ మొదలయ్యాయి. దీనికంతటికి భర్తే కారణమని తెలుసుకున్న యువతి అతడిని నిలదీయడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీ అడ్రస్‌ల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఇదంతా సృజన్ చేశాడని తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు  చుక్కలు కనిపించాయి. సృజన్ పోలీసులకు చిక్కకుండా బ్యాంకు స్ట్రాంగ్ రూములో దాక్కున్నాడు.
 
ఆపై పోలీసుల ముందు గుండెనొప్పిగా వుందంటూ నాటకమాడాడు. అరగంట నడిచిన హైడ్రామాకు తర్వాత పోలీసులు సృజన్‌ను అరెస్ట్ చేశారు. అప్పటికే భర్త ప్రవర్తనపై విరక్తితో ఉన్న సృజన్ భార్య, విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.
 
మరోవైపు కొత్తగా పెళ్లైన యువతి తన భర్త అనుమానిస్తున్నాడనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ హబీబ్ నగర్‌లో చోటుచేసుకుంది. గౌషియా బేగం (23)కు అబ్ధుల్లా అనే వ్యక్తితో గత ఏడాది నవంబర్ 17న వివాహం జరిగింది. ఉద్యోగం లేక తల్లిదండ్రుల వద్ద వుంటున్న అబ్ధుల్లా.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంకా కట్నం తేవాలని వేధించేవాడు. ఇలా భర్త వేధింపులు తాళలేక గౌషియా బేగం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.