శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (14:14 IST)

హైదరాబాద్‌లో ఫారిన్ స్టూడెంట్స్ నివాసాల్లో సోదాలు

హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న విదేశీ విద్యార్థుల గదులు, గృహాల్లో హైదరాబాద్ నగర పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విదేశీ విద్యార్థుల కదలికలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు.. నగరంలో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. 

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలీచౌక్, ఆసిఫ్ నగర్, మై నగర్, ఉస్మానియాతో పాటుగా ఎఫ్లోలో పోలీసులు సోదాలు చేశారు. టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో ఈ సోదాలు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగాయి. ఈ సోదాల్లో 
 
టాస్క్ఫోర్స్ పోలీసులు, ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) అధికారులు, 200 వందల మంది పోలీసులతో తనిఖీలు చేస్తున్నారు.. నైజిరియన్‌ల వీసా గడువును, పాస్‌పోర్ట్‌లను తనిఖీ చేస్తున్నారు. వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.