Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస ఎమ్మెల్సీ కుమారుడు ఎక్కడ?

శుక్రవారం, 12 మే 2017 (10:51 IST)

Widgets Magazine
rape victim

అత్యాచారం కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ కుమారుడి ఆచూకీని హైదరాబాద్ నగర పోలీసులు ఇంతవరకు కనుగొనలేదు. ఓ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి ఐదు రోజులు గడుస్తోంది. ఈకేసులో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన శాసనమండలి సభ్యుడి కుమారుడు ఓ నిందితుడు. అతన్ని హైదరాబాద్ నగర పోలీసులు ఇప్పటివరకు అరెస్టు కాదు కదా.. కనీసం ఆచూకీ కూడా కనుగొనలేక పోతున్నారు. 
 
బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఓ యువతిని ప్రేమపేరుతో నమ్మించిన ప్రీతంరెడ్డి ఈ నెల 6న కొంపల్లిలోని తన ఇంటికి ఆమెను రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులైన స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిని కూడా రప్పించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని వీడియో కూడా తీసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరిగింది. ఆ తర్వాత పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రీతంరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు స్నేహిత్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు అరువారెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కొడుకును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులను కలిసినట్టు సమాచారం. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రీతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు.. దోపిడీలు.. 20 సీసీ కెమెరాలు, చెక్ పోస్టుల ఏర్పాటు.. 

కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ...

news

సీటు విషయంలో వాగ్వాదం... విమానం దిగేటప్పుడు ముష్టిఘాతాలు.. (Video)

సాధారణంగా మన ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం కొట్టుకోవడం, జుట్లుజుట్లు పట్టుకోవడం వంటి ...

news

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ ...

news

ప్రధానితో జగన్ భేటీ.. టీడీపీ వెన్నులో వణుకు... కాళ్ల మీద పడటం చూశారా : కావూరి ప్రశ్న

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న వైకాపా అధినేత వైఎస్. జగన్ ...

Widgets Magazine