గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (08:53 IST)

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నా.. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తున్నాడు : భర్తపై భార్య ఫిర్యాదు

సాఫ్ట్‌వేర్ కంపెనీలో హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేస్తున్న తనను డబ్బుకోసం వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి చేస్తున్నాడంటూ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. ఇలా ఒత్తిడి చేసినందుకు భర్తపై కేసు నమోదు చేయవద్దని, తన వద

సాఫ్ట్‌వేర్ కంపెనీలో హౌస్‌కీపింగ్ విభాగంలో పని చేస్తున్న తనను డబ్బుకోసం వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి చేస్తున్నాడంటూ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. ఇలా ఒత్తిడి చేసినందుకు భర్తపై కేసు నమోదు చేయవద్దని, తన వద్దకు రాకుండా, తనను వేధించకుండా ఉండేలా మందలించాలని ఆమె పోలీసులను ప్రాధేయపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన శంకర్‌ అదే ప్రాంతానికి చెందిన అనిత అనే మహిళను నాలుగేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల పాప ఉంది. తాపీ మేస్త్రీగా పనిచేసే శంకర్‌ కొద్దికాలం క్రితం నగరానికి వచ్చి బోరబండ సైట్‌-3లో ఉంటున్నాడు. అనిత ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హౌస్‌కీపర్‌గా పనిచేస్తోంది.
 
రోజువారి విధులను ముగించుకుని ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా, ఇంటికి వచ్చాక గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతున్న భార్యను శంకర్‌ పలుమార్లు మందలించాడు. అయినా తీరు మార్చుకోకుండా అదేవిధంగా కొనసాగిస్తోంది. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడ్డారు. దాంతో అనిత తన కుమార్తెను తీసుకుని ఇంట్లో నుంచి నేరుగా ఎస్సార్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
అనిత ఫిర్యాదు మేరకు భర్త శంకర్‌ను స్టేషన్‌కు పిలిపించి మందలించారు. అలాగే, తనకు శంకర్‌తో సంసారం చేయడం ఇష్టం లేదని, కేసు పెట్టొద్దని, అతడు తన వద్దకు రాకుండా చూడాలని ఎస్‌ఐ లక్ష్మణ్‌ను వేడుకుంది. ఆ తర్వాత వారిద్దరికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.