Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు సత్వరం స్పందిస్తారనీ... ఆ పని చేసిన మహిళ

శనివారం, 8 జులై 2017 (09:31 IST)

Widgets Magazine
ts police logo

ఓ మహిళ తన భర్త నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసులకు చుక్కలు చూపింది. లైంగికదాడి జరుగుతున్నట్టు ఫోన్ చేస్తే పోలీసులు సత్వరం స్పందిస్తారని, 100 నంబరు మెసేజ్ పంపింది. తనపై కదులుతున్న కారులో ఇద్దరు అత్యాచారం చేస్తున్నట్టు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఉరుకుపరుగులతో ఆ మహిళను రక్షించారు. తీరా విచారణలో అసలు విషయం వెల్లడైంది. హైదరాబాద్ నగరంలో సినీ ఫక్కీలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, మలక్‌పేట రేస్‌కోర్సులో పనిచేస్తున్న ప్రవళికకు 2009లో సంతోష్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత రేస్ కోర్సులో పని చేసే శ్రీకాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో భర్తతో 2013లో విడాకులు తీసుకుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత శ్రీకాంత్‌తో కూడా విభేదాలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో వరంగల్ కాజీపేట్‌లోని గణపతి దేవాలయానికి దైవదర్శనానికి ప్రవళిక వెళ్లింది. బస్సులో ఉండగా శ్రీకాంత్ ఫోన్ చేయగా ఆ విషయమే చెప్పింది. కానీ, ఆమె మాటలు నమ్మని శ్రీకాంత్ స్నేహితుడు అజారుద్దీన్‌తో కలిసి ఒక వాహనాన్ని అద్దెకు తీసుకుని వరంగల్‌కు వెళ్లి ప్రవళికను ఎక్కించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
 
దీంతో విరక్తి చెందిన శ్రీకాంత్.. జనగాంలో వాహనాన్ని ఆపి మద్యం సేవించి, కారులో నిద్రపోయాడు. కానీ శ్రీకాంత్ తీరుతో భయభ్రాంతులకు గురైన ప్రవళిక తనను చంపేస్తారేమోనని భయంతో 100కు సమాచారం అందించినట్లు వివరించారు. లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు త్వరగా స్పందిస్తారని భావించి, తనపై కదులుతున్న కారులో అత్యాచారం జరుగుతున్నట్టు ఫిర్యాదు చేసింది. దీంతో తక్షణం స్పందించిన పోలీసులు.. కారును వెంబడించి తార్నాకలో పట్టుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిని ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

న్యాయవాది కాదు రేపిస్టు.. భార్య ఇంట్లో లేకపోవడంతో పనిమనిషిపై అత్యాచారం

వయసు 60 యేళ్లు. వృత్తి న్యాయవాది. కానీ, కామం కళ్లు కప్పేసింది. ఫలితంగా పలువురి ఇళ్ళలో ...

news

పని ఉందని రమ్మన్నాడు. మత్తుమందిచ్చాడు. పని కానిచ్చాడు.. వీడి వృత్తి తగలడా?

పనీ పాటా లేని పోకిరీలూ అదే పనిచేస్తున్నారు. కామనరం ఉబ్బిపోయిన వారూ అదే పని చేస్తున్నారు. ...

news

ఆ కాలేజీలో 500 మంది గంజాయి దమ్ము గాళ్లేనట... అది కాలేజా లేక గంజాయి కొట్టా?

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అయిన గంజాయిని హైదరాబాద్ కాలేజీలల్లో పోరగాళ్లు ...

news

భర్త అక్రమ సంబంధం.. బట్టలూడదీసి చెప్పుతో కొట్టింది. పాడుబుద్ధి మానలా

ఇది మరే దేశంలోనో జరిగిన ఘటన కాదు. సాక్షాత్తూ భారత్‌లోనే జరిగింది. ప్రేమించి పెళ్లి ...

Widgets Magazine