Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీనియర్‌ని నేనే... చక్రం తిప్పినోణ్ణి నేనే.. చంద్రబాబు టముకు

హైదరాబాద్, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (04:34 IST)

Widgets Magazine
chandrababu

తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా.. ఇపుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నాలాంటి నాయకుడు దేశంలోనే ఎవరూ లేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా చెప్పుకున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్‌ను తానేనని.. ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి ప్రభుత్వాల్లో చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాబు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏలో కొనసాగుతున్నానని పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రం విడిపోయాక నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాట పట్టించేందుకు బస్సు నుంచే పరిపాలన చేశాను. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీలు ఇవ్వలేనంటూనే కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ అందిస్తానని, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే కుప్పంలో ప్రపంచ స్థాయి కమర్షియల్‌ బిల్డింగ్‌ నిర్మిస్తానని చెప్పారు.కుప్పంలో నిరుద్యోగం లేకుండా చేసేందుకు ఇప్పటికే బ్రిటానియా లాంటి కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదిస్తున్నామన్నారు.
 
తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో నిలపడంలో అలసత్వం వహిస్తుండటంపై మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ముఖ్యమంత్రి.. మంత్రి నారాయణ, సిద్దారాఘవరావులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దారినపోయే దానయ్యకు సూటూ బూటూ తొడిగితే పెట్టుబడులొస్తాయా బాబూ: జగన్

రాష్ట్రస్థాయిలో జరిగే భాగస్వామ్య సదస్సులలో అవగాహనా ఒప్పందాలు కుదిరినంత మాత్రాన ...

news

బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత పళనిస్వామి

బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి సీఎంగా ...

news

మీకు 124 మంది ఎమ్మెల్యేలు.. మాకు ఏడు కోట్ల తమిళుల అండ అన్న సెల్వం

ఎంజీఆర్‌ స్థాపించిన, జయలలిత కృషితో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ...

పేరుకు విశ్వనగరమని గప్పాలు: రాజధాని నడిబొడ్డున ఉద్యోగిని దారుణహత్య

విశ్వనగరంగా గప్పాలు కొట్టుకుంటున్న తెలంగాణ రాజధానిలో మరో ఘోరం జరిగింది. టెలికాలర్‌గా ...

Widgets Magazine