గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 9 జూన్ 2017 (03:14 IST)

కోచింగ్ సెంటర్లను నమ్మొద్దు. మీ సొంత శ్రమనే నమ్ముకోండి: సివిల్స్ 3వ ర్యాంకర్ గోపాలకృష్ణ

సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్‌ సెంటర్లకు వెళ్లరాదని, అవి అవాస్తవాలని, తమకు నచ్చిన కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాలని సివిల్స్‌ ఆలిండియా మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, లక్

సివిల్స్‌కు సిద్ధమవుతున్న యువత తన పేరును, ఫొటోను ప్రచారం చేసుకుంటున్న కోచింగ్‌ సెంటర్లకు వెళ్లరాదని, అవి అవాస్తవాలని, తమకు నచ్చిన కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాలని సివిల్స్‌ ఆలిండియా మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటే ఇంగ్లిష్‌ మీడియమైనా, తెలుగు మీడియమైనా, గ్రామీణ ప్రాంతమైనా, పట్టణ ప్రాంతం వారైనా విజయం సాధించవచ్చని, అందుకు ఉదాహరణ తానే అని చెప్పారు. 
 
గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన గోపాల కృష్ణ ‘వివిధ కోచింగ్‌ సెంటర్ల వారు ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. కొన్ని నెలలు బాలలత గారి సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీలో మాత్రమే శిక్షణ పొందాను’ అని  స్పష్టం చేశారు. సుమారు 10 కోచింగ్‌ సెంటర్లలో మాక్‌ ఇంటర్వ్యూలకు వెళ్లానని, అప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటోలతో ఇప్పుడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని, అంతకుమించి ఆ కోచింగ్‌ సెంటర్లతో తనకెలాంటి సంబంధం లేదన్నారు.
 
సోషల్‌ మీడియాలో కొందరు,  వివిధ కోచింగ్‌ సెంటర్లకు అప్పుడే అమ్ముడు పోయావా గోపాల కృష్ణ.. అని ప్రశ్నిస్తు న్నారని, అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. ఐఏఎస్‌ అధికారినయ్యాక విద్య, వైద్యం, రైతు సమస్యలు, మహిళా సాధికారత తదితర అంశాలపై దృష్టి పెడతానని, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అంద రికీ చేరేలా కృషి చేస్తానన్నారు. 
 
‘మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారా’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తానని రోణంకి గోపాలకృష్ణ తేల్చి చెప్పడం గమనార్హం. తెలుగు మీడియంలోనే సివిల్స్‌కి ప్రిపేర్ అయిన రోణంకి నాలుగో పర్యాయం చేసిన ప్రయత్నంలో దేశం మొత్తం మీద సివిల్స్ లో 3వ ర్యాంకు సాధించి సంచనలం రేకెత్తించిన విషయం తెలిసిందే.