Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలా అయితే.. ఎన్నికల్లో పోటీ చేయనంటున్న వైకాపా ఫైర్‌బ్రాండ్‍!

సోమవారం, 17 జులై 2017 (14:52 IST)

Widgets Magazine
Roja

ఆర్కే. రోజా. సినీనటి. ప్రస్తుతం వైకాపా తరపున నగరి శాసనసభ సభ్యురాలు. ఆమె పేరు వింటేనే విపక్ష నేతలంతా హడలిపోతారు. అయితే, ఈమె మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అంటోంది. దీనికీ ఓ కారణం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమట. 
 
ఇటీవల రాజకీయ వ్యూహకర్త (పొలిటికల్ స్ట్రాటజిస్ట్) ప్రశాంత్ కిషోర్ (పీకే) వైకాపాలోకి ప్రవేశించారు. ఆయన ఎంట్రీ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని... లేకపోతే రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తేల్చి చెప్పారు. 
 
అంతేకాదండోయ్... ఏయే నియోజకర్గాల్లో అభ్యర్థులు బలహీనంగా ఉన్నారో కూడా ఆయన ఓ జాబితాను తయారు చేసి జగన్‌కు అందజేశారు. దీంతో, ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అనే టెన్షన్ నేతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో, ఓ వార్తా ఛానల్‌తో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, తాను ఓడిపోయే పరిస్థితి ఉంటే లేదా తాను ఓడిపోతానని పార్టీ భావిస్తే... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. 
 
పోటీ నుంచి తాను తప్పుకుంటానని తెలిపారు. తనకు ఎమ్మెల్యే కావాలనే ఆశ కంటే... వైసీపీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలనే ఆశే ఎక్కువ అని అన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే క్రమంలో ఓడిపోయే అవకాశాలున్న ప్రతి ఒక్కరు పోటీ నుంచి తప్పుకుంటారని, ఈ విషయంలో తాను కూడా ముందుంటానని చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూ.2 కోట్ల లంచంతో శశికళకు వీవీఐపీ సౌకర్యాలు.. లీక్ చేసిన జైళ్ళ డీఐజీపై బదిలీ వేటు

అక్రమాస్తుల కేసులో జైలుశిక్షపడి బెంగుళూరు సెంట్రల్ శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ...

news

పెళ్లికాకుండానే పిల్లలకు పేరు పెట్టినట్లుంది?: ఉపరాష్ట్రపతి పదవిపై వెంకయ్య విముఖత

తాను ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ...

news

డ్రగ్స్ కేసు... టాలీవుడ్ అగ్రహీరోల్లో మరో హీరో వున్నారట... పేరు చెబ్తే భారీ కుదుపేనట...

డ్రగ్స్ వ్యవహారంలో సినీప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే 8 మంది ...

news

మోదీజీ ఆ పదవి నాకొద్దు... వెంకయ్య నాయుడు?

ఉపరాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి. భారతీయ జనతాపార్టీలో ...

Widgets Magazine