Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్-రజినీతో మాట్లాడుతున్నాం... దక్షిణాది ఉద్యమం జెండా రెపరెప... గద్దర్

గురువారం, 29 జూన్ 2017 (21:03 IST)

Widgets Magazine
pawan-gaddar

ప్రజా గాయకుడు గద్దర్ పలుకు పలుకుకీ ఓ పవర్ వుంటుంది. ఆ పవర్‌కి పవర్ స్టార్ తోడైతే... స్టార్‌కి దక్షిణాది సూపర్ స్టార్ జతకూడితే... అదే దక్షిణాది రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక రాజకీయ ఉద్యమం అంటున్నారు సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ (సికా) వ్యవస్థాపకుడు, ప్రజా గాయకుడు గద్దర్. 
 
ఇప్పటికే వారితో ఈ విషయం గురించి చర్చిస్తున్నట్లు వెల్లడించారాయన. గురువారం నాడు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... త్వరలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తమ యొక్క విధివిధానాలను ఇరువురికీ తెలియజేశామనీ, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 
 
తమ ఉద్దేశం దక్షిణాది ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించడమేనన్నారు. అందుకే రజనీకాంత్, పవన్ కళ్యాణ్‌లను 'సికా'లోకి ఆహ్వానించదలచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో వున్న 200 పార్లమెంట్ స్థానాల్లో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తామని, అలా చేయడం ద్వారా 2019 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా వుంటుందో మీరే వూహించుకోండి అని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జూలై నుంచి మీ బీమా ప్రీమియం పెరుగుతోంది... మోదీ GST, సౌదీలో ఫ్యామిలీ ట్యాక్స్

చూస్తుంటే జూలై 1ని ప్రపంచ పన్నుపోటు దినోత్సవంలా ప్రకటించేలా ఉన్నారు దేశ, ప్రపంచ ...

news

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)

చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ...

news

రాష్ట్రంలో 3 ఎన్.సి.సి అకాడమీలు... సి సర్టిఫికెట్ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యం

అమరావతి : రాష్ట్రంలో మూడు ఎన్‌సిసి అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, ...

news

షాకింగ్... రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో మృతి చెందిన పాక్ మహిళా జర్నలిస్ట్(వీడియో)

రిపోర్టింగ్ చేస్తూనే గుడ్లు తేలేస్తూ క్రేన్ పైనుంచి దబ్బున కిందపడి చనిపోయింది ఆ మహిళా ...

Widgets Magazine