శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 25 జులై 2016 (19:23 IST)

ఇంకా ఆచూకీ దొరకని ఏఎన్‌-32 విమానం... క్షణక్షణానికి పెరిగిపోతున్న ఆందోళన..

ఆకాశ యానం వారి కుటుంబాలను ఆందోళనల్లోకి నెట్టివేసింది. ఎప్పుడు అండమాన్‌కు వెళ్లినా ఓడలోనే బయలుదేరేవారు. కానీ ఈసారి విమానంలో వెళ్లడం.. అది కాసేపటికే అదృశ్యమైపోవడంతో ఏం జరిగిందో తెలియక వారంతా బంధువులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన

ఆకాశ యానం వారి కుటుంబాలను ఆందోళనల్లోకి నెట్టివేసింది. ఎప్పుడు అండమాన్‌కు వెళ్లినా ఓడలోనే బయలుదేరేవారు. కానీ ఈసారి విమానంలో వెళ్లడం.. అది కాసేపటికే అదృశ్యమైపోవడంతో ఏం జరిగిందో తెలియక వారంతా బంధువులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన ఆయా కుటుంబాలను శనివారం సీఎం సహా పలువురు మంత్రులు, ప్రముఖులు పరామర్శించారు. మీకు మేమున్నామని భరోసా ఇచ్చారు. అయినా వారి హృదయాల్లోని విషాదానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
 
చెన్నై - అండమాన్‌ మధ్యలో గల్లంతైన భారత వాయుసేన విమానంలో ఉన్న విశాఖవాసుల ఆచూకీ కోసం వారి కుటుంబాలే కాదు.. ఇక్కడి ప్రజలందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికేమీ కాకూడదని కనిపించని ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు. తమవారి క్షేమ సమాచారం కోసం ఆరు కుటుంబాలు నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నాయి.
 
తూర్పు నౌకాదళ కేంద్రంగా ఉన్న విశాఖలో నౌకాదళ సంబంధిత పనులపై ఆధారపడి వేలాదిమంది ఉపాధి పొందుతున్నారు. నావల్‌ డాక్‌యార్డ్‌, ఎన్‌.ఎ.డి.లలో పలువురు చిరుద్యోగులు పనిచేస్తున్నారు. నౌకల మరమ్మతులు, అందులోని ఆయుధాల మరమ్మతులు తదితర చిన్నపాటి పనులనే ఎంతో నైపుణ్యంతో చేస్తూ గౌరవప్రదమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఆయా పనుల్లో తిరుగులేని పట్టు సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. 
 
భారత నౌకాదళం ఎక్కడో అండమాన్లో ఉన్న యుద్ధనౌకలు, సైనికస్థావరాలు, త్రివిధ దళాలు ఉపయోగించే ఆయుధాల మరమ్మతులకు విశాఖ నుంచి సాంకేతిక నిపుణుల్ని విమానాల్లో ఎక్కించి మరీ తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారంటే వీరి పనితనం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్క రలేదు. వీరు చక్కగా విధులు నిర్వర్తిస్తుండడంతో కొన్నేళ్లుగా వీరి సేవల్నే త్రివిధ దళాలు వినియో గించుకుంటున్నాయి. ఒక తనిఖీ అధికారి, ఒక సూపర్‌వైజర్‌, నలుగురు ఫిట్టర్లు, ఇద్దరు సహాయకులు (ట్రేడ్స్‌మెన్‌మెట్‌) ఒక బృందంగా అండమాన్‌ వెళ్తుండడం ఎప్పుడూ జరిగేదే. 
 
బ్యాచ్‌ల వారీగా అక్కడికెళ్లి విధులు నిర్వర్తించి వస్తుండడం వీరికి అలవాటు. ఎ.ఎన్‌.32 అంటే వీరికి చాలా మంచి నమ్మకం. ఎన్నోసార్లు అననుకూల పరిస్థితుల మధ్య సైతం ఆ విమానం చక్కగా దూసుకుపోయేదని, అలాంటి విమానానికి ప్రమాదం జరగిన విషయం నమ్మలేకపోతున్నామని కొందరు అభిప్రాయపడుపతున్నారంటే ఆ విమానంపై వారుంచిన నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గాలింపు చర్యలకు వాతావరణం సైతం అడ్డంగా మారింది. సంఘటన జరిగినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడం, వాతావరణం సైతం గాలింపులకు అంత అనుకూలంగా లేకపోవడంతో గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కావడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందన్న అంశంపై స్పష్టత రావడం లేదు.
 
బంగాళాఖాతం మరింత తీవ్రం. అరేబియా మహాసముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. సముద్రం అడుగున నీటి ప్రవాహాలు సైతం అధికంగా ఉంటాయి. సముద్రంలోనే కూలిపోయి ఉంటే గుర్తించడానికి కూడా చాలా కాలం పట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో లోతు 3500 మీటర్లు ఉండడంతో అంత లోతులో ఉండే ఎలాంటి భారీ వస్తువులైనా గుర్తించడం అంత సులభంకాదు అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.