గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (21:39 IST)

కేసీఆర్ పుస్తకం రాస్తే...? ఆ ఆలోచన ఉందా..!? అందులో ఏముంటుంది.?

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుస్తకం రాస్తే... ఆయనకు ఆ ఆలోచన ఉందా..? రాస్తే...ఏం రాస్తారు.! తెలంగాణ తిట్ల పురాణాన్ని రాసేస్తారా... ఇదే తమాషాగా మనకు గుర్తుకొచ్చే అంశాలు కాస్త సీరియ‌స్‌గా ఆలోచిస్తే... తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ రాష్ట్ర సాధనపై ఓ పుస్తకాన్ని రాయోచ్చు... అంతేనా ఇంకొంచం లోతుకు ఆలోచిస్తే. ఓ భాషా పండితుడు.. భాష మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఇవన్నీ సరే ఆయన పుస్తకం రాస్తారా...! రాస్తారో లేదో తెలియదుగానీ ఆయనలో ఆ ఆలోచనలు రేకిత్తించారు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు... ఎప్పుడు? ఎక్కడ? 
 
విద్యాసాగర్ రావు రచించిన ఉనికి పుస్తాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఇటువంటి పుస్తకాల్ని రచించడానికి భాషా మీద మంచి పట్టుతోపాటు రాయగలిగే సామర్థ్యమున్న వ్యక్తి కేసీఆర్ తమ అనుభవాలతో ఆయన ఒక పుస్తకాన్ని రాస్తే బాగుంటుంది కేసీఆర్‌ని ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ మనసులో ఆయన ఒక బీజాన్ని నాటినట్టు కనిపిస్తోంది. 
 
14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్తానంతోపాటు తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, అవమానాలు, అనుభవాలతో నిజంగానే ఆయనొక గ్రంధ రచనకు పూనుకుంటే బాగుంటుందని కేసీఆర్ అనుచరులు అంటున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది అనుచరులు సభాప్రాంగణంలోనే సరదాగా అనుకోవడం వినిపించింది. సాధారణంగా వ్యక్తుల అనుభవాల రచనలు వారి జీవితపు ఆఖరి ప్రస్థానంలో చేస్తుంటారు.
 
కేసీఆర్ తనదైన‌ శైలిలో తన అనుభవాల్ని క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రాసే విషయమై ఆలోచనలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ కేసీఆర్ కలం నుంచి ఉద్యమ ప్రస్థానంతోపాటు ఆయన ఆలోచిస్తున్న ‘బంగారు తెలంగాణ’పై ఒక పుస్తకాన్ని రాయాలన్న ఆలోచన మంచిదే!