బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 6 జులై 2017 (17:09 IST)

ఒక ఎలుకను పట్టిస్తే రూ. 20,000... ఎక్కడో తెలుసా?

ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు పట్టిస్తే డబ్బులే డబ్బులు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఎలుకలను పట్టే కాంట్రాక్టర్లకు డబ్బులే డబ్బులు. అది కూడా ఒకటి రెండు కాదు. వేలల్లోనే. ఎపి కేబినెట్‌లోని కొంతమంది మంత్రులతో ఉన్న పరిచయాలతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆ

ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు పట్టిస్తే డబ్బులే డబ్బులు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఎలుకలను పట్టే కాంట్రాక్టర్లకు డబ్బులే డబ్బులు. అది కూడా ఒకటి రెండు కాదు. వేలల్లోనే. ఎపి కేబినెట్‌లోని కొంతమంది మంత్రులతో ఉన్న పరిచయాలతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారుతోంది. ప్రభుత్వ ఖజానాను మొత్తం తమ జమానాలోకి లాగేస్తున్నారు కాంట్రాక్టర్లు. 
 
ఒక్క ఎలుకను పట్టడానికి ఇరవై వేలా?
300 ఎలుకలు పట్టుకోవటానికి 60 లక్షలు… ఈమధ్య ఏసీబీ ఎవరిని పట్టినా కోట్లు రాలుతున్నాయి, చూస్తున్నాం కదా. అలాగే చిన్నచిన్న పనుల్లోనూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం కూడా యథేచ్ఛగా సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు హాస్పిటల్‌లో ఎలుకల నివారణకు 60 లక్షలు ఖర్చుపెట్టారట. 300 ఎలుకలు పట్టారట. అంటే ఒక్కో ఎలుకకు 20 వేలు… ఊళ్లల్లో ఎలుకలు పట్టేవాళ్లను ఎవరిని పిలిచి, నాలుగు రోజులు భోజనం పెట్టి, దారి ఖర్చులు ఇచ్చినాసరే మరో 300 దాకా అదనంగా పట్టేసి వెళ్లిపోయేవారు కదా అని జనం ఆశ్చర్యపోతున్నారు. 
 
నిజానికి రైల్వే ఆస్తులు, ఫైళ్లకు ఇబ్బందికరంగా మారిన ప్రాంతాల్లో ఇలా కంట్రాక్టు కింద ఎలుకలు పట్టే పని అప్పగించడం పరిపాటే. కానీ ఓ హాస్పిటల్ కూడా ఇంత భారీ ధరకు ఇంత భారీ కంట్రాక్టు ఇవ్వడం కాస్త అసహజంగానే ఉంది. నిజానికి సదరు కంట్రాక్టర్లు ఎలుకలతో పాటు పందికొక్కులనూ పట్టుకోవాలి. తద్వారా హాస్పిటల్ ఆస్తులకు రక్షణ అని ఈ కాంట్రాక్టు ఇచ్చినవారి సమర్థన. కానీ ఆ కాంట్రాక్టరు మంత్రి కామినేనికి అత్యంత సన్నిహితుడట. మరి 60 లక్షలు ఖర్చు పెట్టారు కానీ ఒక్క పందికొక్కూ దొరకలేదట. మొత్తమ్మీద లెక్కలు మాత్రం సరిపోయాయంటున్నారు.