Widgets Magazine Widgets Magazine

రోజుకు 9 గంటలు నిద్రపోండి.. మీ చేతుల్లో మీ యవ్వనం: దలైలామా

హైదరాబాద్, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (03:38 IST)

Widgets Magazine

ఒక వయస్సు దాటాక, రోజుకు 7 గంటలు నిద్రపోతే సంపూర్ణ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే అని ఆధునిక, ప్రాచీన వైద్య శాస్త్రాలు తెలుపుతున్నాయి. కానీ బౌద్ధ మత గురువు దలైలామా మాత్రం నిత్య యవ్వనానికి ఒకటే సూత్రం అంటున్నారు. అదేమిటో తెలుసా.. రోజుకు 9 గంటలు నిద్రపోతే మీ యవ్వనం మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారాయన.
 
దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ దలైలామాను ఒక ప్రశ్న వేశారు. ’మేము కూడా మీలాగా తేజోవంతంగా, హుషారుగా, తెలివిగా ఉండాలంటే ఏం చేయాలి.. మీరు పాటిస్తున్న రహస్యాన్ని తెలపండి’’.. కార్యక్రమం చివర్లో దలైలామాను మంత్రి కేటీఆర్‌ అడిగిన ప్రశ్న ఇది. 
 
ఈ ప్రశ్నకు దలైలామా నవ్వుతూ.. ‘‘ప్రశాంతంగా నిద్రపోవడమే’’ అన్నారు. తాను ప్రతి రోజు 9 గంటలు నిద్రపోతానని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు నిద్రపోయి తెల్లవారుజామున 3గంటలకు లేస్తానని, ఆ తర్వాత నాలుగైదు గంటలు ధ్యానం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తన వయసు 82 సంవత్సరాలని, కానీ అందరూ 60-65 సంవత్సరాలని అనుకుంటారన్నారు. 
 
మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... బౌద్ధ గురువు దలైలామాతో గడిపిన ఈ క్షణాల్లో తాను ఎంతో విలువైన అంశాలు నేర్చుకున్నానని తెలిపారు. దలైలామా సౌత్ ఏషియా సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సెంటర్‌ కార్యాకలాపాలకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయం చేస్తామని తెలిపారు. ఇప్పటికే స్థలం, రూ. 5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ నమ్మినబంటు ఇంత ఝలక్ ఇచ్చాడా? ఎవరు కారణం?

శశికల శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన తమిళనాడు విద్యాశాఖ మంత్రి మాఫోయ్‌ పాండ్యరాజన్ ...

news

అమ్మలో అంతటి సమ్మోహన శక్తి: భోరుమన్న శశికళ

అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలితలో ఉన్న సమ్మోహన శక్తిని మరెవ్వరిలోనూ తాను చూడలేదని ఆ ...

news

అన్నయ్య గన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. అన్నయ్య ఇడియట్ అని తిట్టాడు: పవన్

హార్వర్డ్ యూనివర్సిటీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తాను ...

news

అన్నాడీఎంకే నేత దారుణ హత్య.. కత్తితో పొడిచి చంపేశారు.. రాజకీయ కారణాలు కాదట

తమిళనాట చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పట్టపగలు నడిరోడ్డు పైన అన్నాడీఎంకే పార్టీ ...