బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:45 IST)

ఏపీ ఐఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం : మంత్రి గంటా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరంభించారు. ఆగస్టు మొదటి వారంలో ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 1230, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 755 సీట్ల భర్తీకి ఈ నెల మూడోవారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. తిరుపతి, అమరావతి, విశాఖను విద్యానగరాలుగా అభివృద్ధి చేస్తామని గంటా హామీ ఇచ్చారు. 
 
ఈ  ఏడాది 224 సూపర్ న్యూమరీ సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించి ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత ఫాకల్టీకి చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా చెప్పారు.