Widgets Magazine

అసహజ బంధం.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది... ఎలా?

బుధవారం, 5 జులై 2017 (08:46 IST)

Widgets Magazine
deadbody

అసహజబంధం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఫలితంగా రెండు నిండు ప్రాణాలు అర్థాంతరంగా తనువు చాలించగా, ఓ తల్లిని ఇద్దరు పిల్లలకు దూరం చేసింది. పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరి ఆత్మహత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... శ్రీకాకుళం జిల్లా సోమన్నపేటకు చెందిన బూరాడ సీతాలక్ష్మి(32)కి బూరాడ ప్రసాద్‌ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి పది, ఎనిమిదేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
అయితే, కొంతకాలంగా సీతాలక్ష్మికి తన బావ.. బూరాడ భుజంగరావు కుమారుడు ధనుంజయ అలియాస్ రాజు (21)తో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో భర్త ప్రసాద్‌ తన తల్లి వద్ద పిల్లలను విడిచి పెట్టి.. సీతాలక్ష్మిని కర్ణాటక తీసుకెళ్లిపోయాడు. అక్కడ బొంతల పనిచేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ధనుంజయ సోమన్నపేటలో ఉంటూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
 
గతనెల 28న ధనుంజయ ఇంటిలో నుంచి కొంత బంగారం, దుస్తులు పట్టుకొని ఊరు విడిచి వెళ్లిపోయాడు. అదేరోజు కర్ణాటకలో ఉంటున్న సీతాలక్ష్మి కూడా అక్కడి నుంచి భర్తకు చెప్పకుండా అదృశ్యమైంది. ధనుంజయ, సీతాలక్ష్మి ఇద్దరూ కలిసి వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగారు. ఇంతలో ఏమైందో.. ఏమో మంగళవారం పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
మానవ సంబంధాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తూ.. వరుసకు పిన్ని.. కొడుకుల మధ్య ఏర్పడిన ఈ వివాహేతర సంబంధం... వారి విషాదాంతానికి కారణమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. బిడ్డపైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పని లేకున్నా అర్ధరాత్రి వరకూ మేల్కొనే ఉంటున్నారా.. అయితే మరణమే శరణం

నిద్రాదేవి నిను వరించె గదరా నిర్భాగ్య దామోదరా అని పద్యం ఉంది. ఇప్పుడు దానికి పూర్తి ...

news

చైనా వైఫల్యం.. భారత్‌కు అద్భుత విజయం.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే...

భారత్‌ను చీటికీ మాటికీ కవ్విస్తూ, బెదిరిస్తూ, స్థాయిని తగ్గించే మాటలతో అవమానిస్తూ ఫోజు ...

భారత ప్రధానికి ఇజ్రాయెల్ అపూర్వ గౌరవం... తరలివచ్చిన నెతన్యాహూ మంత్రివర్గం

దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన తొలి భారత ప్రధాని నరేంద్రమోదీకి ...

news

పేదరికం నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతో పెద్దపులులకు ఆహారం అవుతున్నారు

పూర్వకాలం మహారాజులు కూడా వారసులకు రాజ్యభారాన్ని అప్పగించిన తర్వాత వానప్రస్థాశ్రమం పేరుతో ...