Widgets Magazine

బాబాయ్... తప్పుచేశాం.. మొహం చూపించడం సిగ్గుగా ఉంది... అందుకే చచ్చిపోతున్నాం...

గురువారం, 6 జులై 2017 (13:52 IST)

Widgets Magazine
deadbody

పిన్నితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఈ విషయం నలుగురికి తెలియడంతో ఇంటినుంచి లేచిపోయి ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు.. తన  బాబాయ్‌కి చనిపోయే ముందు ఓ మెసేజ్ పంపించాడు. 'బాబాయ్‌ మేము కర్ణాటకలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. మన వారందరినీ చూడాలని ఉంది అని పిన్ని అనడంతో పొందూరుకు వచ్చాం. అయినా గ్రామానికి వెళ్లి మొహం చూపించడం సిగ్గుగా అనిపించింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాం. పిల్లలిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి' అంటూ సీతాలక్ష్మీ భర్త ప్రసాద్‌‌కు ధనుంజయ ఓ ఎస్‌ఎంఎస్‌ పెట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ ఆత్మహ్యకు పాల్పడ్డారు. 
 
ఇదిలావుండగా, సీతాలక్ష్మి(32)కి బూరాడ ప్రసాద్‌ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 10, 8 యేళ్ల వయసు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కొంతకాలంగా సీతాలక్ష్మికి తన బావ.. బూరాడ భుజంగరావు కుమారుడు ధనుంజయ అలియాస్ రాజు (21)తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీన ధనుంజయ - సీతాలక్ష్మిలు ఇంటి నుంచి పారిపోయారు. వీరిద్దరూ కలిసి వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగారు. 
 
ఇంతలో ఏమైందో.. ఏమో మంగళవారం పొందూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారు. మానవ సంబంధాల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తూ.. వరుసకు పిన్ని.. కొడుకుల మధ్య ఏర్పడిన ఈ వివాహేతర సంబంధం... వారి విషాదాంతానికి కారణమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. బిడ్డపైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. 
 
ఈనేపథ్యంలో పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సోమన్నపేటకు తీసుకువచ్చారు. ఆ మృతదేహాలను చూసి.. కుటుంబసభ్యులు, బంధువులు బోరున విలపించారు. గ్రామస్థుల సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ధనుంజయ చితికి తండ్రి భుజంగరావు, సీతాలక్ష్మి చితికి భర్త ప్రసాద్‌ నిప్పంటించారు. పరువుకోసమో, తాము చేసిన తప్పునకు సమాధానం చెప్పలేమోనని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని కొందరు అభిప్రాయపడ్డారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Woman Boy Suicide Ponduru Srikakulam Illegal Relation Railway Track

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆమెకు 45 - అతడికి 25.. వివాహేతర బంధం : పెళ్లికి అడ్డుతగులుతుందనీ కర్రతో కొట్టి చంపేశాడు

పట్టుమని పాతికేళ్ల కూడా నిండని కుర్రాడితో 45 ఏళ్ల మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆమె ...

news

ఫ్లైట్‌లో కిటికీ పక్క సీటులో మహిళ.. వెనుక సీట్లో కూర్చొని 'అక్కడ' తాకిన ప్రయాణికుడు

మహిళలపై భూమిపైనే కాదు.. నింగిలోనూ భద్రత లేకుండా పోయింది. విమానంలో కిటికీ పక్క సీట్లో ...

news

పులికి ఆహారమైపో! వృద్ధులను అడవుల్లోకి పంపుతున్న కొడుకులు.. ఎక్కడ?

కాటికి కాళ్లు చాపిన వయసులో తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన వృద్ధులను కొందరు కొడుకులు ...

news

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ...