బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2016 (08:52 IST)

నేటి నుంచి కౌంట్‌డౌన్.. 26న 8 ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ35 రాకెట్ ప్రయోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఇస్రో) నుంచి ఈ నెల 26న మరో రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. మొత్తం 8 ఉప గ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ నింగిలోకి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఇస్రో) నుంచి ఈ నెల 26న మరో రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. మొత్తం 8 ఉప గ్రహాలతో పీఎస్‌ఎల్‌వీ-సీ35 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 
 
ఈ ప్రయోగం కోసం శుక్రవారం షార్‌లో మిషన్ రెడీనెస్‌ రివ్యూ సమావేశం జరిగింది. రాకెట్‌ అనుసంధానంపై సమీక్షించారు. 48 గంటలు కౌంట్‌డౌన్ జరపాలని ముందుగా నిర్ణయించినా మరో అరగంట కొనసాగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇందులోభాగంగా, శనివారం ఉదయం 8.42 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. 
 
సోమవారం ఉదయం 9.12 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ ద్వారా దేశ వాతావరణ పరిశీలనకు కాట్‌శాట్‌ ఉపగ్రహంతోపాటు ముంబై‌, బెంగుళూరు విద్యార్థుల రెండు బుల్లి ఉపగ్రహాలు, మరో 5 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.