గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 27 జూన్ 2016 (21:14 IST)

ప్రకాశం జిల్లా దొనకొండలో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్క్... రూ.43 వేల కోట్ల భారీ ప్రాజెక్టు

టియాంజిన్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో పాల్గొంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో సక్సెస్ అయ్యారు. రెండో రోజు సోమ

టియాంజిన్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషికి అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో పాల్గొంటూ విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో సక్సెస్ అయ్యారు. రెండో రోజు సోమవారం చైనాతో కుదిరిన ప్రాథమిక అవగాహనా ఒప్పందం రెండు రోజుల పర్యటనలో హైలైట్‌గా చెప్పవచ్చు.
 
ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.43 వేల కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. చైనా అసోసియేషన్ ఆప్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్స్, చైనా స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజస్ గ్రూపు లిమిటెడ్ (బీజింగ్)లతో ఏపీ ఈడీబీ, ఇండస్ట్రీస్, కామర్స్ మినిస్ట్రీ అవగాహన ఒప్పందం చేసుకుంది.
 
మొత్తం 6.4 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడితో 55 వేల మంది ఉపాధి లక్ష్యంతో ఈ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది. మూడు దశలలో రూ.43,120 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కును మూడు దశల్లో పూర్తి చేస్తారు. మొదటి దశలో పెట్టుబడి రూ.10,106.2 కోట్లు, రెండవదశలో రూ.12,127.6 కోట్లు, మూడో దశలో రూ.14,148.8 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. 
 
ఈ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు వల్ల  తొలిదశలో 10 వేలమందికి, రెండోదశలో 21 వేల మందికి, మూడవదశలో 24వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా లక్షా 20 వేల మంది ఉపాధి పొందనున్నారు. పార్కు నిర్మాణంలో భాగంగా రూ. 6036కోట్ల పెట్టుబడులతో బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రియల్ పార్కు, రూ.36,889 కోట్లతో మోడర్న్ బిల్డింగ్ మెటీరియల్స్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటవుతాయి. ఇందుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. నలభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రకాశం జిల్లా దొనకొండలో 10 వేల ఎకరాలలో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కును నిర్మించ తలపెట్టారు.
 
ఎకో సిటీపై ప్రెజెంటేషన్
టియాంజిన్‌లో సింగపూర్, చైనా సంయుక్తంగా నిర్మించిన ఎకో సిటీపై ముఖ్యమంత్రి బృందానికి సంబంధిత ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎకో సిటీలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 వేల గ్రీన్ హోమ్స్ నిర్మించారు. 2008లో ప్రారంభమై ఈ  ఏడాది ప్రాజెక్టు పూర్తయ్యింది. ఎకోసిటీలో పూర్తిగా గ్రీన్ హోమ్స్ ఏర్పాటయ్యాయి. రవాణా సైతం గ్రీన్ కాన్సెప్ట్ ‌తో రూపొందించారు.  ఈ పర్యావరణ నగరంలో 3,500 కంపెనీలు, స్కూళ్లు, నైబర్‌హుడ్ సెంటర్లు, పార్కులు, థీమ్ పార్కులు ఉన్నాయి.