Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోషల్ మీడియాలో పొలిటికల్ పంచ్.. చంద్రబాబు కన్నెర్ర... నెటిజన్ అరెస్టు

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (17:39 IST)

Widgets Magazine
political punch

సోషల్‌ మీడియాలో పొలిటికల్‌ పంచ్‌‌లు వేసేవారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నెర్రజేశారు. ఇలాంటి పంచ్‌లతో పాటు.. సెటైర్లు, కార్టూన్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కారు హెచ్చరించింది. 
 
అంతేకాదండోయ్... శాసనమండలి (పెద్దల సభ) గురించి ఇంటూరి రవి కిరణ్‌ అనే నెటిజన్ ఓ వ్యంగ్య కార్టూన్ వేసినందుకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దల సభను కించపరుస్తూ కార్టూన్‌ వేయడంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటూరి కిరణ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. చట్ట సభలను కించపరిస్తే ఎవరిపై నైనా చర్య తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి సత్యన్నారాయణ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌, మంత్రులను కించపరుస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 
 
దీనిపై ఇంటూరి రవి కిరణ్ భార్య సుజన మాట్లాడుతూ.. తన శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఎనిమిది మంది వ్యక్తులు వచ్చిన తన భర్తను కారెక్కించి తీసుకెళ్లారని తెలిపారు. ఎక్కడకు తీసుకెళ్లారో కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆమె బోరున విలపిస్తూ చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేయసితో వాళ్లది అడ్డు చెప్తారనుకున్నాడు... ఫిక్స్ అనేసరికి జంప్ అయ్యాడు...

ఉప్పు-కారం, తీపి-చేదు, తప్పు-ఒప్పు వున్నట్లే ప్రేమికుల్లో మంచి ప్రేమికులు, దొంగ ...

news

అమెరికా, రష్యాలనే భయపెట్టే బాంబులు భారత్ వద్ద వున్నాయి... రహస్యంగా...

అణు రహిత బాంబులు తమకే సొంతం అన్నట్లు అమెరికా, రష్యాలు చెపుతుంటాయి. తమవద్ద వున్న బాంబులే ...

news

రెండేళ్ళ ప్రేమ.. మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం.. పెళ్లికొడుకు జంప్.. ఎందుకంటే?

వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతూ ...

news

మృత్యు లారీ 20 మందిని చంపేసింది... ధర్నా శిబిరంలోకి దూసుకెళ్లింది....

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ...

Widgets Magazine