Widgets Magazine

కమ్యూనిస్టులతో పవన్ ప్రయాణం లాభాన్నిస్తుందా...!

శుక్రవారం, 12 మే 2017 (12:34 IST)

Widgets Magazine
pawan kalyan

సినీనటులు రాజకీయాల్లోకి రావడం కొత్తమే కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ రాజకీయాలను ఒంట పట్టించుకున్న వారే. సినీరంగంలో కాస్త పేరు వస్తే చాలు ఇక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలన్న తపన వచ్చేస్తోంది. ఇదే కోవలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ప్రజల్లో చతికిలపడి చివరకు పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి కలిపేసి ప్రస్తుతం సైలెంట్ ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. 
 
151వ సినిమా తీసుకుంటే రాజకీయ ఇంటర్వ్యూ అంటేనే మీడియా ప్రతినిధులకు దణ్ణం పెట్టేస్తున్నారు. అయితే చిరంజీవి దారిలోనే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ నడుస్తున్నారట. వీరిద్దరికి వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేకున్నా అటు సినీరంగంలోను, ఇటు రాజకీయరంగంలోను ఎవరి వారు ఎలాంటి సలహాలు ఇచ్చుకోరు. ఎందుకుంటే ఎవరి దారి వారిద్దన్నమాట. ఒకరి మాట మరొకరు వినరు. అందుకే రాజకీయాల్లో ఎవరికి వారు ఒక్కో దిక్కులో ఉన్నారు. వీరిద్దరిలో పవన్ కళ్యాణ్‌దే ప్రస్తుతం హాట్ టాపిక్. 
 
రాజకీయ పార్టీ పెట్టినా పోటీ మాత్రం ఇంతవరకు చేయలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానని పవన్ స్వయంగా ప్రకటించాడు. దీంతో జనసేనలోకి వెళ్ళాలని చిన్న చిన్న పార్టీలు ఉవ్విళ్ళూరుతున్నాయి. జనసేనలోకి వెళితే అధికారం ఖాయమన్నది వారి భావన. అయితే ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే కమ్యూనిస్టులు మాత్రం పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరు చూసి ఆయనతో జనకట్టేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇప్పటికే సిపిఐ ఎపి కార్యదర్శి రామక్రిష్ణ పవన్‌తో మంతనాలు జరుపగా తాజాగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం భేటీ అయ్యారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమ్యూనిస్టులతో కలిసేందుకు పవన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ప్రజల వెంట ఉండే కమ్యూనిస్టులతో కలిస్తే మంచిదన్నదే ఆయన అభిప్రాయం. అయితే వీరు కలిసి ఇప్పటి నుంచే పనిచేస్తారా.. లేకుంటే ఎన్నికల్లో మాత్రమే కలుస్తారా అన్నది తేలాల్సి ఉంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అల్లరి భరించలేక.. క్లాస్‌రూమ్‌లో కొడుకు పక్కనే కూర్చున్న తండ్రి.. ఎక్కడ?

కొడుకు చదువుకుంటున్న క్లాసులోనే తండ్రి కూర్చున్నాడు.. ఎందుకో తెలుసుకోవాలంటే? ఈ స్టోరీ ...

news

నాడు పొంగిపోలేదు... నేడు కుంగిపోలేదు.. దటీజ్ మంత్రి నారాయణ

ఏపీ రాష్ట్ర పురపాలకశాఖామంత్రి పి.నారాయణ పుత్రశోకంతో తల్లడిల్లిపోతున్నారు. చేతికి ...

news

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు ...

news

భారత్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రసంస్థల కుట్ర : అమెరికా హెచ్చరిక

భారత్‌లో పేలుళ్ళతో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని అమెరికా ...