శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (15:30 IST)

జగన్ అక్రమ పెట్టుబడుల కేసులన్నీ మాకు బదిలీ చేయండి : ఈడీ

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలో పెట్టిన పెట్టుబడులన్నీ అక్రమ పెట్టుబడులేనని, అందువల్ల ఆ కేసులన్నీ తమకు బదిలీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కోరింది. 
 
రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్‌ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిన ఈ కేసును తమశాఖ కోర్టుకు బదిలీ చేయాలని లోగడ ఈడీ అధికారులు కోరగా సీబీఐ కోర్టు తిరస్కరించిన విషయంతెల్సిందే. 
 
ఈ నేపథ్యంలోనే పీఎంఎల్‌ చట్టంలోని సెక్షన్‌ 44(1)(సి)ని అన్వయిస్తూ తాజాగా ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీన్ని మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశముందని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా, జగతి పెట్టుబడుల కేసులో అనేక అక్రమాలు ఉన్నాయని పేర్కొంది