గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2016 (16:26 IST)

రోజమ్మతోనే అసెంబ్లీలో అడుగు... బాబుకు బుద్ధి... జగన్, రోజా పొగరు తగ్గలేదు... పీతల

కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయని స్థితిలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉన్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తీర్పు కాపీ ఇచ్చినా కూడా రోజమ్మను అసెంబ్లీలోనికి ప్రవేశించడం వీలుకాదని చెప్పడం దారుణమన్నారు. వైకాపా నుంచి జంప్ అయిన ఆ 8 మందిని రక్షించేందుకే చంద్రబాబు ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగన్ విమర్శించారు. 
 
రోజమ్మపై విధించిన సస్పెన్షన్ పిటీషన్ కోర్టు ఎత్తివేసినా స్పీకర్ దాన్ని పట్టించుకోవట్లేదనీ, అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వస్తుందన్నారు. చంద్రబాబు నాయుడుతో స్పీకర్ కోడెల కుమ్మక్కయ్యారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 14 రోజుల తర్వాత చర్చ చేపట్టాల్సి ఉండగా వెనువెంటే చర్చలు జరిపి తమ ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి తాము కోర్టులకన్నా పెద్దవాళ్లమని చెపుతున్నారు. 
 
సీఎం, స్పీకర్ ఇద్దరూ పదవులను దుర్వినియోగపరుస్తున్నారు. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని లేఖ ఇచ్చాం. కోర్టు తీర్పును గౌరవించడంలేదని ఫిర్యాదు. రోజా అడుగుపెట్టిన రోజే మేము కూడా అసెంబ్లీలో అడుగుపెడతాం అని చెప్పుకొచ్చారు. కాగా రోజా మాటలను చూస్తుంటే సస్పెండ్ అయినప్పటికీ ఆమె అహంకారం తగ్గినట్లు లేదన్నారు మంత్రి పీతల సుజాత. తమను కించపరిచిన రోజా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి వీల్లేదని అన్నారు.