గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (12:53 IST)

దుమ్ముగూడెం - నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా..

దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఓ లేఖ రాశారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించాలని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని తెలిపారు. 
 
ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా గోదావరి నదీ జలాలను నాగార్జునసాగర్ వైపునకు లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో మళ్లిస్తే ఇరు రాష్ట్రాల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని జగన్ లేఖలో పేర్కొన్నారు.
 
రాష్ట్ర విభజన నేపథ్యంలో దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.