శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (20:55 IST)

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆగిపోయిందన్న ఛైర్మన్!: మోడీకి జగన్ లేఖ

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఆగిపోయిందని కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయట్లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో శుక్రవారం భేటీ  సందర్భంగా ఛైర్మన్ స్పష్టం చేశారు. 
 
ఈ సందర్భంగా కృష్ణా రివర్ బోర్డు మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలతో చర్చించి ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని చంద్రబాబుకు తెలిపారు. త్వరలోనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఛైర్మన్ వెల్లడించారు. 
 
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీకి వైకాపా అధినేత జగన్ లేఖ రాసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం జల వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ప్రధానిని లేఖలో విజ్ఞప్తి చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. 
 
రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడిలో ఉందని... కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితిలో ఉందని ప్రధానికి జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టడం లేదని... రియల్ఎస్టేట్ వ్యాపారం, సొంత ప్రయోజనాలు తప్ప... ప్రజల గురించి ఆలోచించడం లేదని లేఖలో ఆరోపించారు.