గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 జులై 2016 (14:03 IST)

ఏపీని మేం ముక్కలు చేయలేదు.. నాటి ముఖ్యమంత్రి కె రోశయ్యే ఖరారు చేశారు : జైరాం రమేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ముక్కలు చేయలేదనీ, నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కె. రోశయ్యే ఖరారు చేశారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. 2013

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ముక్కలు చేయలేదనీ, నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కె. రోశయ్యే ఖరారు చేశారనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. 2013 అక్టోబర్ 8వ తేదీనే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. 
 
రాష్ట్ర విభజనపై జైరాం రమేశ్‌ 'ఓల్డ్‌ హిస్టరీ న్యూ జియోగ్రఫీ' పుస్తకాన్ని రాశారు. దీనిని సీనియర్‌ జర్నలిస్టు ఏ కృష్ణారావు 'గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం' అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
 
ఇందులో జైరాం రమేష్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కె.రోశయ్య తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓ తీర్మానం చేశారనీ ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 అక్టోబర్‌ 8న కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. రెండుప్రాంతాల్లోని రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. 
 
రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో స్పష్టంగా ఉందని చెప్పారు. హైకోర్టు విభజనపై అప్పుడే హోం శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. అయినా ఇప్పటివరకు హైకోర్టు విభజన పూర్తి చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. అన్ని ఆధారాలతోనే పుస్తకాన్ని రాసినట్టు పేర్కొన్నారు.