గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (12:33 IST)

పవన్.. అవకాశరాజకీయాలొద్దు.. ఆ హీరోయిజం ఏమైంది..? టైమ్ పాస్ చేయొద్దు..

జనసేన అధినేత పవన్ రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో దూసుకు రావట్లేదని విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అడుగు పెడితే ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం తన

జనసేన అధినేత పవన్ రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో దూసుకు రావట్లేదని విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అడుగు పెడితే ప్రజలు ఆశగా ఎదురుచూస్తారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం  తను గొప్ప గొప్ప అంటూ చెబుతూనే ఉంటుంది ఎప్పుడూ కానీ పాలిటిక్స్ లో అతని నిజాయతీ ఇంకా బయటపడే రోజులు మాత్రం రాలేదు. యువరాజ్యం అధినేతగా ఉన్న సమయంలో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. నిజాయితీగానే పనిచేశాడు. 
 
అప్పట్లో షబ్బీర్ అలీ ని ఓపెన్‌గా ఉతికి ఆరేసాడు పవన్ కల్యాణ్. కాంగ్రెస్ పంచెలు ఊడేలా తరిమి కొట్టండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు కళ్యాణ్. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్‌లో రెచ్చిపోయి కాంగ్రెస్ నాయకులను తిట్టింది పవనే. అందుకే కౌంటర్ ఎటాక్ కూడా గట్టిగానే ఎదుర్కున్నాడు పవన్. పాలిటిక్స్‌లో పవన్ చివరి హీరోయిజం అదే. కానీ ఏపీ సీఎం చంద్రబాబు- ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే అవకాశవాదిగా పవన్ మారాడు అనే మాటలు వినపడుతున్నాయి. 
 
నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పడం.. అందుకు చంద్రబాబు గట్టిగా పోరాటం కూడా చేయాలి. అయినా చేయట్లేదు. వారిని పవన్ ప్రశ్నించలేదు. కొన్నాళ్లు కామ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రులు వెంకయ్య - సుజనా లాంటి వారిని తిడుతూ టైం పాస్ చేస్తున్నాడు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాయపాటి సాంబశివరావుని బాధ్యత చేసి పవన్ తిట్టిపోశాడు. 
 
ప్రత్యేక హోదా రాకపోవడానికి వెంకయ్య, సుజనా చౌదరీలు కారణమని చెప్పి వాళ్ళనూ తిడుతూనే ఉన్నాడు. కానీ ఇతరులపై ఆధారపడకుండా ప్రశ్నిస్తానన్న పవన్.. కేంద్రాన్ని స్వయంగా అడగవచ్చుకదా అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవకాశవాద రాజకీయాలకు పవన్ పాల్పడుతున్నాడని.. అందుకే స్వయంగా పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు న్యాయం చేయాలని వారు సూచిస్తున్నారు.