Widgets Magazine

14న జనసేన ఆవిర్భావ సభ... ఇంకెన్ని గాయాలు (వీడియో)

ఈ నెల 14వ తేదీ బుధవారం జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరుగనుంది. దీనికి గుంటూరు జిల్లా కేంద్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయం వేదికకానుంది. ఈ భారీ బహిరంగ సభ 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగేలా ఏర్పాట్లు చేస్తున్

janasena party
pnr| Last Updated: మంగళవారం, 13 మార్చి 2018 (08:53 IST)
ఈ నెల 14వ తేదీ బుధవారం జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ జరుగనుంది. దీనికి గుంటూరు జిల్లా కేంద్రంలోని నాగార్జున విశ్వవిద్యాలయం వేదికకానుంది. ఈ భారీ బహిరంగ సభ 35 ఎకరాల విస్తీర్ణంలో జరుగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, తమ నాలుగేళ్ల ప్రయాణంపై, భవిష్యత్ కార్యాచరణపై వివరిస్తానని ఆయన అన్నారు. కాగా, ఈ రోజు అమరావతిలో సొంతింటి నిర్మాణం భూమి పూజ చేసిన అనంతరం పవన్ కల్యాణ్ గుంటూరుకు వచ్చారు.

జనసేన సభ ఏర్పాట్ల గురించి నేతలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం తాను మాట్లాడనున్న సభావేదికపైకి ఎక్కి చూశారు. సభ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే సోషల్ మీడియా ద్వారా తమ కార్యకర్తలకు, అభిమానులకు పలు రకాల సూచనలు, మార్గదర్శకాలు చేశారు.


దీనిపై మరింత చదవండి :