విద్యార్థులకు న్యాయం చేస్తే సరేసరి.. లేకుంటే...: పవన్ వార్నింగ్

శుక్రవారం, 8 డిశెంబరు 2017 (14:27 IST)

విజయవాడలోని ఫాతిమా కాలేజీ విద్యార్థులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి తాను రోడ్డెక్కుతానని హెచ్చరించారు.
pawan kalyan
 
శుక్రవారం విజయవాడలో ఆయన ఫాతిమా కాలేజీ విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము ఎదుర్కుంటున్న సమస్యల గురించి పవన్‌కు వారు ఏకరవు పెట్టారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా ఆలకించిన పవన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని.. ఫాతిమా విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకుంటే... వారితో కలిసి తాను కూడా ఉద్యమిస్తానని ప్రకటించారు. 
 
కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్ష అనుభవించాలని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యపై మంత్రి కామినేనితో మాట్లాడి వెంటనే న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించాలని కేంద్రాన్ని కోరడం కాదు.. అవసరమైలే.. కేంద్రాన్నే ఇక్కడికి తీసుకొద్దామన్నారు. ఫాతిమా విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపకపోతే.. అది ఏపీ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు. దీనిపై మరింత చదవండి :  
Pawan Kalyan Vijayawada Tour Fathima Medical College Students

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్యాషియర్‌‌కు తుపాకీ గురిపెట్టాడు.. వీడియో

తుపాకీలు చూపెట్టి నేరాలకు పాల్పడే దుండగుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే చోరీకి వచ్చిన ఓ ...

news

జగన్ పైన పవన్ పంచ్.... పవన్‌కు నారా లోకేష్ ఝలక్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్ని సమస్యల గురించి ప్రస్తావించినా పెద్దగా చర్చకు రాలేదు కానీ ...

news

రాజస్థాన్ 'లవ్ జిహాద్' వీడియో

రాజస్థాన్ రాష్ట్రంలో లవ్ జీహాద్ పేరుతో ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన వ్యవహారం ...

news

ఢిల్లీ లిక్కర్ మాఫియా దాష్టీకం : మహిళ నగ్న ఊరేగింపు

ఢిల్లీలో లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. తమ గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ...