Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆసక్తికరం... పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసే సబ్జెక్ట్... విజయేంద్రప్రసాద్ స్టోరీ కేక...

మంగళవారం, 4 జులై 2017 (10:40 IST)

Widgets Magazine

కొన్ని సినిమాల ప్రభావం ప్రజలపై మామూలుగా వుండదు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజీఆర్ , జయలలిత వంటివారు తమతమ సందేశాత్మక చిత్రాలతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఆగిపోయారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే వరకూ రాలేకపోయారు. దీనికి కారణం వారి వ్యక్తిత్వంతో పాటు రాజకీయ నేర్పు కూడా అవసరం. 
pawan kalyan
 
ఇదిలావుంటే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ ముఖ్య సభ్యులు కసరత్తు చేస్తున్నారు. 2018 మార్చి నుంచి పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సినిమాలు వదిలేసి రాజకీయాలకు అంకితమవుతారట. ఈ నేపధ్యంలో 2018 ఫిబ్రవరిలో ఆయన హీరోగా బలమైన సందేశాత్మక చిత్రం తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. 
 
ఇప్పటికీ ఈ సబ్జెక్టుపై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నారట. దాదాపు స్క్రిప్టు పూర్తయిందనీ, తుది మెరుగులు దిద్దుతున్నారని ఫిలిమ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ సబ్జెక్టును తెరపైకి ఎక్కించి, అందులో పవన్ కళ్యాణ్ నటిస్తే ఇక ఆంధ్రలో కేక పుట్టిస్తుందంటున్నారు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఈ స్టోరీ వుంటుందనీ, అందువల్ల ఆ చిత్రంతో పవన్ సినీ ప్రపంచం నుంచి రాజకీయ ప్రపంచంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశిస్తారని అంటున్నారు. ఇటు తెదేపా, అటు వైకాపాలను కిందకి తోసి పవన్ కల్యాణ్ ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రిగ్గర్ నొక్కగానే తల వెనుక నుంచి దూసుకొచ్చిన మాంసం.. బుల్లెట్...

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పేరు ప్రభాకర్ రెడ్డి. ఈయన ...

news

'నేటి భారత్‌ 1962లో ఉన్నప్పటి భారత్‌ కాదు' : అరుణ్ జైట్లీ

సిక్కిం, 'డోక లా' ప్రాంతంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం దృష్ట్యా భారత్, చైనాల మధ్య ఉద్రిక్త ...

news

హిందువులు భరతమాతకు తిలకం దిద్దితే.. టోపీ, గడ్డం పెట్టే దమ్ము ముస్లింలకు లేదా: అక్బరుద్దీన్ ఓవైసీ

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఓవైసీ బ్రదర్స్ ముందుంటారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే ...

news

సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ జయమ్మ అదుపు తప్పారు: శశికళ భర్త నటరాజన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రోజూ ప్రభుత్వం కోసం 20 గంటలు కష్టపడటం ఆరోగ్యానికి ...

Widgets Magazine