శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (14:17 IST)

మా గొంతులు సరే... కేటీఆర్, ఆయన కారు డ్రైవర్ సంగతేంటి : మత్తయ్య

ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ఇచ్చిన స్వరపరీక్షల నివేదికపై ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన మధ్యవర్తి జెరూసలెం మత్తయ్య సోమవారం స్పందించారు. ఓటుకు నోటు కేసులో ఫోన్లో మాట్లాడింది తానేనని... ఆ గొంతు తనదేనని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కొత్తగా చేప్పేదేముందని ప్రశ్నించారు. 
 
'నా గొంతు గురించి ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పేదేముంది... అది నా గొంతే అని నేనే చెబుతున్నా'నని... ఫోనులో మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్సీ స్టీవెన్సన్‌ను కలసి తాను మాట్లాడానని కూడా చెప్పారు. 
 
అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన డ్రైవర్ తనను బెదిరించారని... వారి స్వరం కూడా ఫోన్ లో రికార్డయిందని... మరి వారి సంగతేంటని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి కుట్ర జరిగిందా? లేదా? అనే విషయం తేలాలని చెప్పారు. ఈ కేసులో టి.ఏసీబీ తనపై కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.