Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జ్ఞానపీఠ్'కే వన్నె తెచ్చారు... తెలుగు జాతికి తీరని లోటు : చంద్రబాబు - జగన్

సోమవారం, 12 జూన్ 2017 (11:26 IST)

Widgets Magazine
C. Narayana Reddy

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతరం సినారె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఓ సంతాప ప్రకటనను విడుదల చేశారు. జ్ఞానపీఠ్‌ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారె అని, రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు చెప్పారు. తెలుగు చలనచిత్ర రంగంలో సినారె పాటలు ఆణిముత్యాలు అని ఆయన కొనియాడారు. 
 
అలాగే, జగన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో... సినారె మరణం తెలుగుజాతికి తీరని లోటన్నారు. సినారె మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని నారాయణ రెడ్డి సేవలను జగన్ కొనియాడారు. సినారె విడిచివెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని జగన్ అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రైతుల హెచ్చరికలతో మహా సర్కారుకు ముచ్చెమటలు.. రుణమాఫీకి ఓకే

రుణాలమాఫీ కోరుతూ సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరికలు చేశారు. ఈ ...

news

నయీమ్ ఆయుధాలు బయటపడ్డాయ్.. పడకగదిలో తుపాకీ తూటాలు..

ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆయుధాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు చేపట్టిన ...

news

ఆ హంతకుడి పుర్రెను 176 యేళ్లుగా భద్రపరుస్తున్నారు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తుల శరీరాలు చెడిపోకుండా భద్రపరిచి వారిని ...

news

వడ్డీ వ్యాపారం పేరిట.. వేధింపులు.. బాకీ తీర్చు లేకుంటే.. కోరికైనా తీర్చమంటూ..

వడ్డీ వ్యాపారం పేరిట.. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యాపారిపై ఎట్టకేలకు కేసు ...

Widgets Magazine