గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 4 మే 2016 (14:42 IST)

జ‌గ‌న్ రాక‌కు ముందే... బ్రాండెక్స్ సమ‌స్య‌ను చ‌క్క‌బెట్టేసిన మంత్రి

విశాఖ ఎస్.ఇ.జ‌డ్.లో బ్రాండెక్స్ కార్మిక వివాదం చుట్టూ రాజ‌కీయాలు ముసురుకున్నాయి. కార్మికుల స‌మ్మెపై స్పందించి, వారిని ఓదార్చేందుకు జ‌గ‌న్ విశాఖ‌కు బ‌య‌లుదేరారు. ఇంత‌లోనే ఆ స‌మ‌స్య‌ను తాము ప‌రిష్క‌రించేశామ‌ని ఏపీ మంత్రి చెప్పేశారు. జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఓదార్చే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని, ఆగమేఘాల‌పై బ్రాండెక్స్‌ను ముసిరేశారు. 
 
విశాఖ బ్రాండిక్స్ కంపెనీ కార్మికుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఏపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇప్పటికే అనేకసార్లు బ్రాండిక్స్ సంస్థ యజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరపడంతో మినిమం వేజ్‌బోర్డ్ అమలు చేయడానికి అంగీకరించిందన్నారు. 
 
ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం మినిమం వేజ్‌బోర్డ్ నియామకం చేస్తుందన్నారు. రాజకీయ స్వార్థంతో కొన్ని శక్తులు కార్మికులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. కార్మిలు లబ్ది పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.