గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 16 జూన్ 2016 (12:49 IST)

రాష్ట్రపతి పాలనకు కుట్రపన్నాయి.. అసదుద్దీన్ హెచ్చరించడంతో బతికిపోయా : కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా విపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా విపక్ష పార్టీలు కుట్ర పన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విపక్షాలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు యత్నించాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కాగానే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలకు తెర తీశాయని ఆయన ఆరోపించారు. 
 
తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నించిన ఆ రెండు పార్టీలు... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పెట్టించే పన్నాగం పన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాము ఈ కుట్రలను పసిగట్టలేకపోయామని కూడా కేసీఆర్ అన్నారు. ఈ సమయంలోనే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనకు ఫోన్ చేసి ఈ కుట్రలను వివరించారన్నారు. విపక్షాల కుట్రలపై అప్రమత్తం చేయడంతోనే సరిపెట్టుకోని ఒవైసీ... విపక్షాల కుట్రలకు చెక్ పెట్టేలా తమకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చి, ఆ విధంగానే ఆయన నడుచుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.