Widgets Magazine

సీఎం చంద్రబాబుకు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు... ఎందుకు?

మంగళవారం, 30 జనవరి 2018 (21:57 IST)

Kalva Srinivasulu

అమరావతి: అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో గల భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురాడానికి అవసరమైన రూ.969 కోట్లు  విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు తనతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం శాసనసభ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును మంత్రి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు.
 
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా భైరవానితిప్ప ప్రాజెక్టుకు తరలింపునకు రూ.969 కోట్లు మంజూరుచేయడం ఆనందకర విషయమన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా 22,323 ఎకరాలకు సాగునీటితో పాటు నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కలుగుతుందన్నారు. సాగునీటితో కళ్యాణదుర్గం, రాయదుర్గం సస్యశ్యామలం అవుతాయని, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు, రైతులు జీవితాంతం రుణపడి ఉంటామని సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కాలవ శ్రీనివాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట తెలుగు యువత రాష్ట్ర నాయకులు ఉన్నం మారుతి చౌదరి ఉన్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Kalva Srinivasulu Cm Chandrababu Naidu

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాత్రంతా ఒకటే చాటింగ్- భార్య ఫిర్యాదు.. నటుడు సామ్రాట్‌ అరెస్ట్.. సీసీటీవీ కెమెరాలో?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఇంటికొచ్చినా చాలామంది కుటుంబాన్ని, భార్యను పట్టించుకోకుండా ...

news

గాజువాక ప్రజలకు ఇక హ్యాపీ... ఎందుకో తెలుసా?

గాజువాక పరిధిలోని స్థలాలను క్రయవిక్రయాలు చేసేందుకు కాలపరిమితిని 2 సంవత్సరాలకు ...

news

8 నెలల పాపపై 28 ఏళ్ల కామాంధుడి అత్యాచారం.. పరిస్థితి విషమం

దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని ...

news

ప్రియుడి కోసం బడాబాబును పెళ్లి చేసుకుంది.. చివరికి ఏం చేసిందంటే?

జల్సాకు అలవాటు పడి ఓ యువతి దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది. తాను వలచిన యువకుడిని వివాహం ...

Widgets Magazine