హమ్మయ్య... మరో ప్రజారాజ్యం-2: మెగా ఫ్యామిలీలో మళ్లీ చెయ్యి పెట్టిన కత్తి మహేష్

శుక్రవారం, 6 జులై 2018 (18:46 IST)

కత్తి మహేష్. పవన్ కళ్యాణ్‌ గురించి వ్యాఖ్యలు చేసి ఆ తరువాత బాగానే ఇరకాటంలో పడ్డారు. ఎలాగోలా బయటకు వచ్చి మళ్ళీ సినిమా రివ్యూలు చెప్పుకుంటున్నారు. అయితే సినిమా రివ్యూల సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తను అనుకున్నదాన్ని నిర్మొహమాటంగా చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం కత్తి మహేష్ మరోసారి ఇబ్బందుల్లో పడిపోయాడు. అది కూడా పవన్ కళ్యాణ్‌, మెగా ఫ్యాన్స్ కారణంగానే. 
 
అసలేమైందంటే... చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడు జనసేన పార్టీలో చేరారు. మెగా ఫ్యామిలీ అంతా జనసేనకి సపోర్ట్‌గా ఉంది. హమ్మయ్య మొత్తానికి జనసేన, ప్రజారాజ్యం-2 అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయంటూ చెప్పాడు. అంతటితో ఆగలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం రాజకీయ బిజినెస్‌ను స్టార్ట్ చేసింది అన్నాడు. 
 
ఇదంతా ఇప్పుడు అటు పవన్, ఇటు చిరంజీవి ఫ్యాన్స్‌లో తీవ్ర ఆగ్రహావేశాలను తెప్పిస్తోంది. పవన్ పైన మొదట్లో ఆరోపణలు చేసిన తరువాత మళ్ళీ అలాంటి పని చేయనని చెప్పిన కత్తి మహేష్ మళ్ళీ అలాంటిదే చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా పవన్, చిరు అభిమానులు కత్తి మహేష్‌ను తిట్టిపోస్తున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :  
Janasena Sensational Comments Pawan Kalyan Kathi Mahesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

యువతిపై రౌడీ షీటర్ రేప్.. తల్లి కళ్లముందే మూడు రోజులు.. కుక్కను కూడా?

హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ...

news

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా? ఎవరన్నారు?

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా.. ఈ సందేహం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ...

news

రాహుల్ డ్రగ్ బానిస.. డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి : బీజేపీ ఎంపీ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ ...

news

అలా చేస్తే రాహుల్ ప్రధాని అవుతారు : సోనియాతో జేసీ దివాకర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు, రాహుల్‌కు పెళ్లి కావాలంటే ఆయన ...